Share News

బ్రిటన్‌ వీసా చార్జీల మోత

ABN , Publish Date - Feb 07 , 2024 | 03:58 AM

బ్రిటన్‌లోని రుషి సునాక్‌ ప్రభుత్వం వీసా చార్జీలను భారీగా పెంచింది. అన్ని రకాల వీసాలపైనా ఇమ్మిగ్రేషన్‌ హెల్త్‌ సర్‌ చార్జీ(ఐహెచ్‌ఎ్‌స)ని 66ు విధిస్తున్నట్టు తెలిపింది. దీంతో వీసా

బ్రిటన్‌ వీసా చార్జీల మోత

ఇంగ్లాండ్‌, ఫిబ్రవరి 6: బ్రిటన్‌లోని రుషి సునాక్‌ ప్రభుత్వం వీసా చార్జీలను భారీగా పెంచింది. అన్ని రకాల వీసాలపైనా ఇమ్మిగ్రేషన్‌ హెల్త్‌ సర్‌ చార్జీ(ఐహెచ్‌ఎ్‌స)ని 66ు విధిస్తున్నట్టు తెలిపింది. దీంతో వీసా చార్జీలు భారీగా పెరగనున్నాయి. ఈ పెంపు మంగళవారం(నిన్న) నుంచే అమల్లోకి వచ్చేసింది. అయితే, జనవరి 6వ తేదీలోపు వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నవారిని ఈ పెంపు నుంచి మినహాయించినట్టు సునాక్‌ ప్రభుత్వం పేర్కొంది. బ్రిటన్‌లో నివాసం ఉండాలన్నా, ఆ దేశంలోకి ప్రవేశించాలన్నా ఐహెచ్‌ఎస్‌ తప్పనిసరి. ఈ ఫీజును దరఖాస్తు సమర్పించే సమయంలోనే ముందస్తుగా చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఐహెచ్‌ఎస్‌ పెంపుతో ఒక్కొక్క వీసాపై రూ.65 వేలకు పైగా భారం పడనుంది.

Updated Date - Feb 07 , 2024 | 01:55 PM