Share News

యూజీసీ నెట్‌ ఫలితాల వెల్లడి

ABN , Publish Date - Oct 18 , 2024 | 06:14 AM

యూజీసీ ఆధ్వర్యంలో జరిగిన నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఎన్‌ఈటీ-నెట్‌) ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. ఆగస్టు, సెప్టెంబరుల్లో 11 రోజుల పాటు 83 సబ్జెక్టుల్లో

యూజీసీ నెట్‌ ఫలితాల వెల్లడి

న్యూఢిల్లీ, అక్టోబరు 17: యూజీసీ ఆధ్వర్యంలో జరిగిన నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఎన్‌ఈటీ-నెట్‌) ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. ఆగస్టు, సెప్టెంబరుల్లో 11 రోజుల పాటు 83 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు జరిగాయి. వీటిని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించింది. ఈ పరీక్షల కోసం మొత్తం 11,21,225 మంది పేర్లు రిజిస్టర్‌ చేసుకోగా అందులో 6,84,224 మంది మాత్రమే పరీక్షలు రాశారు. వారిలో 4970 మంది జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌), 53,694 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పదవులకు, 1,12,070 మంది పీహెచ్‌డీకి అర్హత సాధించారు. ఫలితాలను యూజీసీనెట్‌ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. వీటితో పాటుగా పరీక్షల కటాఫ్‌ మార్కులను కూడా వెబ్‌సైట్‌లో పెట్టింది.

Updated Date - Oct 18 , 2024 | 06:14 AM