Share News

Naxals : ఛత్తీస్‌గఢ్‌లో రెండు ఎన్‌కౌంటర్లు.. ముగ్గురు నక్సల్స్‌ మృతి

ABN , Publish Date - May 26 , 2024 | 06:03 AM

ఛత్తీ్‌సగఢ్‌లో శనివారం జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో ముగ్గురు నక్సల్స్‌ మృతిచెందారు. ఇటీవలి ఎన్‌కౌంటర్లలో పోలీసులు తునికాకు సేకరణకు వెళ్లిన 10 మంది సాధారణ పౌరులను కాల్చి చంపారని, అందుకు

Naxals  : ఛత్తీస్‌గఢ్‌లో రెండు ఎన్‌కౌంటర్లు.. ముగ్గురు నక్సల్స్‌ మృతి

చర, మే 25: ఛత్తీ్‌సగఢ్‌లో శనివారం జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో ముగ్గురు నక్సల్స్‌ మృతిచెందారు. ఇటీవలి ఎన్‌కౌంటర్లలో పోలీసులు తునికాకు సేకరణకు వెళ్లిన 10 మంది సాధారణ పౌరులను కాల్చి చంపారని, అందుకు నిరసనగా ఆదివారం బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో మావోయిస్టు నాయకులు సుకుమా అడవుల్లో సమావేశమైనట్లు ఉప్పందుకున్న డీఆర్‌జీ, బస్తర్‌ ఫైటర్స్‌ కూంబింగ్‌ చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందారు. బీజాపూర్‌ జిల్లా మిర్తూర్‌ ఠాణా పరిధిలోని కంకనార్‌ అడవుల్లో శనివారం కూంబింగ్‌లో ఉన్న బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో.. ప్రతిదాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మరోవైపు, బీజాపూర్‌ జిల్లా గంగలూరు ఏరియా కమిటీకి చెందిన 33 మంది మావోయిస్టులు శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇదిలా ఉండగా, ముగ్గురు గ్రామీణులను హతమార్జిన కేసులో ఎన్‌ఐఏ శనివారం ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఈ చార్జ్‌షీట్‌లో మావోయిస్టు నేతలు సన్నూరామ్‌ అత్లామీ, సురేశ్‌ కత్లామీ, శంకర్‌ నూరేటి పేర్లను చేర్చింది.

Updated Date - May 26 , 2024 | 07:18 AM