Share News

Modi hat-trick prime minister : మూడోసారి!

ABN , Publish Date - Jun 05 , 2024 | 05:40 AM

వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రి.. జవహర్‌లాల్‌ నెహ్రూకు తప్ప 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఎవరికీ దక్కని అరుదైన రికార్డు ఇది. నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ మొత్తం మూడుసార్లు ప్రధాని అయినా.. మధ్యలో ఒకసారి ఏడాదిన్నర పదవికి దూరమయ్యారు. అయితే, ‘హ్యాట్రిక్‌’ రికార్డును అందుకునే అవకాశం ఈసారి నరేంద్ర

Modi hat-trick prime minister : మూడోసారి!

నెహ్రూ తర్వాత హ్యాట్రిక్‌ ప్రధానిగా మోదీ అరుదైన రికార్డు

25 ఏళ్ల రాజకీయంలో మెజారిటీ దక్కనిది ఇప్పుడే

వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రి.. జవహర్‌లాల్‌ నెహ్రూకు తప్ప 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఎవరికీ దక్కని అరుదైన రికార్డు ఇది. నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ మొత్తం మూడుసార్లు ప్రధాని అయినా.. మధ్యలో ఒకసారి ఏడాదిన్నర పదవికి దూరమయ్యారు. అయితే, ‘హ్యాట్రిక్‌’ రికార్డును అందుకునే అవకాశం ఈసారి నరేంద్ర మోదీకి లభించింది. వచ్చే ఐదేళ్లు కూడా ఆయన కొనసాగితే అత్యధిక కాలం పదవిలో ఉన్న మూడో ప్రధానిగా రికార్డు అందుకుంటారు. నెహ్రూ రికార్డు స్థాయిలో 16 సంవత్సరాల 286 రోజులు ప్రధానిగా ఉన్నారు. ఇందిర 15 ఏళ్ల 350 రోజులు పదవిలో కొనసాగారు. మోదీ 2029 వరకు ప్రధాని ఉన్నప్పటికీ ఇందిర రికార్డుకు కొంత దూరంలోనే ఉండిపోనున్నారు. అయితే, 1962 తర్వాత హ్యాట్రిక్‌ ప్రధాని మాత్రం ఈయనే. 2001లో గుజరాత్‌ సీఎం అయిన మోదీని 2014లో ప్రధాని అభ్యర్థిగా ముందుకుతెచ్చింది బీజేపీ. అప్పట్లో మోదీ దేశమంతా చుట్టివచ్చారు. కాషాయ పార్టీ ఏకంగా 282 లోక్‌సభ సీట్లను గెలిచింది. 272 సీట్ల మేజిక్‌ మార్క్‌ను దాటింది. 30 ఏళ్లలో తొలిసారిగా ఓ పార్టీ సొంతంగా ఈ సంఖ్యలో సీట్లు సాధించింది. మరోవైపు 2019లో జాతీయవాద పవనాలు బలంగా వీయడంతో 303 స్థానాల్లో నెగ్గింది. అయితే, ఇప్పుడు మాత్రం 240 సీట్లకు కొద్దిగా అటుఇటు సంఖ్యకు పరిమితం అవుతోంది. కాగా, దాదాపు 24 ఏళ్ల రాజకీయ జీవితంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మోదీ తన సారథ్యంలో బీజేపీని తొలిసారి మెజారిటీ మార్క్‌ చేర్చలేకపోయారు. మిత్రపక్షాల మద్దతుపై ఆధారపడక తప్పని పరిస్థితుల నేపథ్యంలో మోదీ మూడో టర్మ్‌ అంత సాఫీగా ఉండదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. - సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - Jun 05 , 2024 | 05:40 AM