రాముని గుడిలో సాయి విగ్రహంపై అభ్యంతరం
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:15 AM
స్థానిక జఖూలోని రామ మందిరంలో సాయిబాబా విగ్రహం ఉండడంపై జ్యోతి్‌షమఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి అభ్యంతరం తెలిపారు. ఆ ఆలయానికి వెళ్లబోనంటూ

ఆలయాల్లో వాటికి చోటు లేదని శంకరాచార్య వ్యాఖ్య
సిమ్లా, అక్టోబరు 24: స్థానిక జఖూలోని రామ మందిరంలో సాయిబాబా విగ్రహం ఉండడంపై జ్యోతి్‌షమఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి అభ్యంతరం తెలిపారు. ఆ ఆలయానికి వెళ్లబోనంటూ గురువారం ఉదయం అక్కడ ఏర్పాటు చేసిన ‘గౌ ధ్వజ్’ కార్యక్రమాన్ని బహిష్కరించారు. గోవుల సంరక్షణపై అవగాహన కలిగించేందుకు ఆలయం ఆవరణలో గౌ ధ్వజ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే అక్కడ సాయిబాబా విగ్రహం ఉందని ఆయనకు సమాచారం అందండంతో ఆలయానికి రాలేనంటూ ఆ యన నిర్వహకులకు తెలిపారు. హిందూ ఆలయాల్లో సాయిబాబాకు స్థానం లేదని శంకరాచార్య చెప్పారు. సాయి పేరును ఏ గ్రంథాల్లోనూ ప్రస్తావించలేదని తెలిపారు. కేవలం ధనార్జన కోసమే ఆలయ నిర్వాహకులు, పూజారులు ఆ విగ్రహాన్ని పెట్టారని ఆరోపిస్తూ వీడియోను విడుదల చేశారు.