Share News

ప్రత్యేక దక్షిణాది దేశం ఆలోచన ప్రమాదకరం

ABN , Publish Date - Mar 01 , 2024 | 04:48 AM

ప్రత్యేక దక్షిణ భారత అంశాన్ని కాంగ్రెస్‌ ఎంపీ డీకే సురేష్‌ లేవనెత్తడాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తప్పుబట్టారు. ఇది అత్యంత ప్రమాదకరమైన

ప్రత్యేక దక్షిణాది దేశం ఆలోచన ప్రమాదకరం

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌

బెంగళూరు, ఫిబ్రవరి 29(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక దక్షిణ భారత అంశాన్ని కాంగ్రెస్‌ ఎంపీ డీకే సురేష్‌ లేవనెత్తడాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తప్పుబట్టారు. ఇది అత్యంత ప్రమాదకరమైన పోకడ అని వ్యాఖ్యానించారు. దేశాన్ని బీజేపీ ఏకం చేస్తుంటే కాంగ్రెస్‌ నోట ఇలాంటి విభజన మాటలు పదేపదే వినిపిస్తున్నాయని ఆమె విమర్శించారు. బెంగళూరులోని ఆదాయపన్నుల శాఖ కార్యాలయంలో గురువారం జరిగిన ఓ కార్యక్రమం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాలకు నిధుల విడుదలలో కేంద్రం నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. నిధుల విడుదలలో ఫైనాన్స్‌కమిషన్‌ను కాదని కేంద్రం వ్యవహరించడం లేదన్నారు. కర్ణాటకలో వనూలయ్యే పన్నులను ఎక్కడికీ తరలించడం లేదని, ఆ రాష్ట్ర అభివృద్ధికే వినియోగిస్తున్నామని ఆమె చెప్పారు.

Updated Date - Mar 01 , 2024 | 04:48 AM