Share News

ప్రధాన న్యాయమూర్తే నిర్ణయిస్తారు

ABN , Publish Date - May 29 , 2024 | 03:35 AM

వైద్య పరీక్షల నిమిత్తం తన మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని కోరుతూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ అత్యవసర విచారణను సుప్రీం కోర్టు వెకేషన్‌ బెంచ్‌ తిరస్కరించింది.

ప్రధాన న్యాయమూర్తే నిర్ణయిస్తారు

కేజ్రీవాల్‌ బెయిల్‌ పొడిగింపుపై సుప్రీం వెకేషన్‌ బెంచ్‌

న్యూఢిల్లీ, మే 28 (ఆంధ్రజ్యోతి): వైద్య పరీక్షల నిమిత్తం తన మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని కోరుతూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ అత్యవసర విచారణను సుప్రీం కోర్టు వెకేషన్‌ బెంచ్‌ తిరస్కరించింది. కేజ్రీవాల్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) తదుపరి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసింది. జూన్‌ 1తో కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌ ముగుస్తుందని, అందువల్ల అత్యవసర విచారణ చేపట్టాలని సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ విజ్ఞప్తి చేశారు.

Updated Date - May 29 , 2024 | 07:45 AM