Share News

ఎంపీల సగటు ఓట్లు 50.58%

ABN , Publish Date - Jul 05 , 2024 | 01:09 AM

తాజా లోక్‌సభ ఎన్నికల్లో విజేతలు పోలైన ఓట్లలో సగటున 50.58ు ఓట్లు పొందారు. 2019 ఎన్నికలతో పోల్చితే ఇది 2ు తక్కువ కావడం గమనార్హం. దేశంలోని మొత్తం ఓట్ల సంఖ్య ఆధారంగా విశ్లేషణ జరిపితే..

ఎంపీల సగటు ఓట్లు 50.58%

గతంతో పోల్చితే స్వల్పంగా తగ్గుదల

ఏడీఆర్‌ విశ్లేషణలో వెల్లడి

న్యూఢిల్లీ, జూలై 4: తాజా లోక్‌సభ ఎన్నికల్లో విజేతలు పోలైన ఓట్లలో సగటున 50.58ు ఓట్లు పొందారు. 2019 ఎన్నికలతో పోల్చితే ఇది 2ు తక్కువ కావడం గమనార్హం. దేశంలోని మొత్తం ఓట్ల సంఖ్య ఆధారంగా విశ్లేషణ జరిపితే.. వారికి సగటున 33.44ు ఓట్లు మాత్రమే వచ్చాయి. మునుపటి ఎన్నికల్లో సగటు ఓట్లు 35.46ు మేర ఉండగా ఈసారి అవి తగ్గాయి. పోలింగ్‌ శాతం తగ్గడమే ఇందుకు కారణం. క్రిమినల్‌ కేసులు ఉన్న ఎంపీల్లో 42ు మందికి కూడా 50శాతం కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ (ఎన్‌ఈడబ్ల్యూ)లు జరిపిన సమగ్ర విశ్లేషణలో ఇలాంటి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. గుజరాత్‌లోని సూరత్‌ నియోజకవర్గంలో ఏకగీవ్ర ఎన్నిక జరగడంతో దాన్ని మినహాయించి మొత్తం 542 స్థానాల ఫలితాలను విశ్లేషించాయి.

మొత్తం విజేతల్లో 279 మంది ఎంపీలకు పోలైన ఓట్లలో 51ు కన్నా అధికంగా ఓట్లు వచ్చాయి.

263 మంది ఎంపీలకు 50ు కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. వీరిలో 75 మంది బీజేపీ, 57 మంది కాంగ్రెస్‌, 32 మంది సమాజ్‌వాదీ, 21 మంది తృణమూల్‌, 14 మంది తృణమూల్‌ ఎంపీలు ఉన్నారు.

215 మంది ఎంపీలపై క్రిమినల్‌ కేసులు ఉండగా వారిలో 106 మంది 50శాతం కన్నా అధికంగా ఓట్లు సంపాదించారు.

మొత్తం ఎంపీల్లో 503 మంది కోటీశ్వరులు కావడం విశేషం. వీరిలో 262 మంది పోలైన ఓట్లలో సగానికన్నా ఎక్కువగానే ఓట్లు సంపాదించారు.

అయిదుగురు ఎంపీలు 2,000 ఓట్ల కన్నా తక్కువ మెజార్టీతో విజయం సాధించారు.

అత్యఽఽఽధికంగా ఓట్ల వాటా పొందిన వారిలో బీజేపీకి చెందిన శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ (56.43ు- విదీశా), శంకర్‌ లాల్వానీ (64.54%- ఇండోర్‌) ఉన్నారు. మహిళల్లో అయితే కీర్తి దేవి దేబ్‌బర్మన్‌ (68.54ు- తూర్పు త్రిపుర) ఉన్నారు.

214 మంది ఎంపీలు మరోసారి ఎన్నిక కాగా, వారిలో 101 మందికి సగానికన్నా ఎక్కువగా ఓట్లు వచ్చాయి.

నోటాకు కూడా ఈ సారి తక్కువ ఓట్లే పడ్డాయి. 2019లో 1.12ు ఓట్లు నోటాకు పడగా ఈసారి 0.99ు మాత్రమే వచ్చాయి.

మొత్తం ఓటింగ్‌ శాతం తగ్గడమే ఇందుకు ఒక కారణం. 2019లో 67.35ు ఓట్లు పోల్‌ కాగా, ఈ సారి 66.12 శాతం మంది మాత్రమే ఓటు వేశారు.

Updated Date - Jul 05 , 2024 | 06:43 AM