Share News

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

ABN , Publish Date - Apr 03 , 2024 | 03:07 AM

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల జిల్లా పర్చూరు మండలం బోడవాడ గ్రామానికి చెందిన ఆచంట రేవంత్‌ (22) మృతి చెందారు.

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

పర్చూరు, ఏప్రిల్‌ 2: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల జిల్లా పర్చూరు మండలం బోడవాడ గ్రామానికి చెందిన ఆచంట రేవంత్‌ (22) మృతి చెందారు. బోడవాడకు చెందిన ఆచంట రఘు, వరలక్ష్మిల కుమారుడు రేవంత్‌ చైన్నైలో బీటెక్‌ పూర్తిచేసుకొని గత సంవత్సరం డిసెంబర్‌లో ఎంఎస్‌ కోసం అమెరికా వెళ్లారు. వాషింగ్టన్‌ డకోట స్టేట్‌ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం వేకువజామున కారులో స్నేహితులతో వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. మైనస్‌ డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదు కావడంతో రోడ్డుపై గడ్డకట్టిన మంచుకారణంగా కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో రేవంత్‌ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

Updated Date - Apr 03 , 2024 | 07:04 AM