Share News

పెద్దలకు టీబీ వ్యాక్సిన్‌!

ABN , Publish Date - Mar 25 , 2024 | 04:46 AM

ఏటా దాదాపు కోటి మంది కిసోకి.. దాదాపు 15లక్షల మంది ప్రాణాలు బలిగొంటున్న క్షయ మహమ్మారిని నివారించే ‘ఎంటీబీవ్యాక్‌’అనే టీకా త్వరలోనే అందుబాటులోకి రానుంది.

పెద్దలకు టీబీ వ్యాక్సిన్‌!

మానవుల నుంచి సేకరించిన క్షయ బ్యాక్టీరియాతో..

తొలిసారి తయారుచేసిన స్పానిష్‌ కంపెనీ బయోఫాబ్రీ

ఆ సంస్థతో కలిసి ట్రయల్స్‌ చేపట్టిన భారత్‌ బయోటెక్‌

ప్రపంచంలోనే తొలి లైవ్‌ ఎటెన్యుయేటెడ్‌ టీబీ వ్యాక్సిన్‌

ప్రస్తుతానికి సేఫ్టీ ట్రయల్స్‌.. వచ్చే ఏడాది ఎఫికసీ ట్రయల్స్‌

మానవుల నుంచి సేకరించిన క్షయ బ్యాక్టీరియాతో తొలిసారి తయారు చేసిన స్పానిష్‌ కంపెనీ

ఆ సంస్థతో కలిసి భారత్‌ బయోటెక్‌ ట్రయల్స్‌

హైదరాబాద్‌, మార్చి24 (ఆంధ్రజ్యోతి): ఏటా దాదాపు కోటి మంది కిసోకి.. దాదాపు 15లక్షల మంది ప్రాణాలు బలిగొంటున్న క్షయ మహమ్మారిని నివారించే ‘ఎంటీబీవ్యాక్‌’అనే టీకా త్వరలోనే అందుబాటులోకి రానుంది. క్షయవ్యాధికి సంబంధించి ప్రపంచంలోనే తొలి లైవ్‌ ఎటెన్యుయేటెడ్‌ వ్యాక్సిన్‌ ఇది. స్పెయిన్‌కు చెందిన ఫార్మా సంస్థ బయోఫ్యాబ్రీ తయారుచేసిన ఈ టీకా సేఫ్టీ, ఇమ్యూనోజెనెసిటీ ట్రయల్స్‌ను ఆ సంస్థతో కలిసి చేపడుతున్నట్టు భారత్‌ బయోటెక్‌ సంస్థ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. క్షయ నివారణకు ప్రస్తుతం చిన్నారులకు వేస్తు న్న బీసీజీ టీకా చాలా పాతది. అది జంతువుల్లో క్షయను కలిగించే బ్యాక్టీరియాను సేకరించి తయారు చేసిన వ్యాక్సిన్‌. పెద్ద వయసులో వచ్చే క్షయను నివారించే టీకాలేవీ ప్రస్తుతానికి లేవు. ఈ రెండు సమస్యలనూ పరిష్కరించేలా బయోఫ్యాబ్రీ.. మానవులకు సోకే క్షయకారక ‘మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌క్యూలోసిస్‌’ సూక్ష్మక్రిమి నుంచి ఈ లైవ్‌ ఎటెన్యుయేటెడ్‌ టీకాను అభివృద్ధి చేసింది. లైవ్‌ ఎటెన్యుయేటెడ్‌ వ్యాక్సిన్‌ అంటే వ్యాధికారక సూక్ష్మక్రిమిని.. అది మనకు ఏ హానీ చేయలేనం త బలహీనంగా మార్చి మన శరీరంలోకి ప్రవేశపెట్టే టీకా. ఎంఎంఆర్‌, పోలియో చుక్కలు ఇందుకు ఉదాహరణ. ఇవి అత్యంత సమర్థంగా పనిచేస్తాయి. ఎంటీబీవ్యాక్‌ అలాంటిదే. దీన్ని పెద్దలకూ ఇవ్వొ చ్చు. ఈ క్రమంలోనే తొలుత క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా దీన్ని పెద్దలపై ప్రయోగిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం చేపట్టినవి సేఫ్టీ అండ్‌ ఇమ్యూనోజెనెసిటీ ట్రయల్స్‌ అంటే.. ఈ టీకా ఎంతవరకు సురక్షితం? ఏమేరకు రోగనిరోధక వ్యవస్థను స్పందింపజేసి యాంటీబాడీలు తయారయ్యేలా చేయగలదు?అనే అంశాలను ఈ ట్రయల్స్‌లో పరీక్షిస్తారు. ఈ టీకా ఎంత సమర్థంగా పనిచేస్తుందో పరీక్షించే ఎఫికసీ ట్రయల్స్‌ వచ్చే ఏడాది నిర్వహించనున్నారు. కాగా.. భారత్‌లో పెద్దలు, కౌమారప్రాయంలో ఉండేవారిపై ఈ టీకా ట్రయ ల్స్‌ నిర్వహించడాన్ని గొప్పమైలురాయిగా బయోఫ్యాబ్రీ సీఈవో రోడ్రిగ్జ్‌ పేర్కొన్నారు. బయోఫ్యాబ్రీతో కలిసి ఈ టీకా ట్రయల్స్‌లో భాగస్వాములుకావడం గౌరవంగా భావిస్తున్నామని భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. పెద్దలు, యుక్తవయసులో వ్యాధిని నివారించడానికి టీబీ వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు.

స్పెయిన్‌లో..

ఈ టీకా అభివృద్ధి, క్లినికల్‌ ట్రయల్స్‌.. దాదాపు 3దశాబ్దాల కృషి. పారి్‌సలోని పాశ్చర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్టర్‌ బ్రిగిట్‌ గిక్వెల్‌..స్పెయిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ జరగోజా ల్యాబ్‌లో ఈ టీకా అభివృద్ధి చేశారు. జరగోజా వర్సిటీకి పారిశ్రామిక భాగస్వామి అయిన బయోఫ్యాబ్రీ ఈ టీకాను ఉత్పత్తి చేస్తోంది. ఈ టీకా ఎంత డోసు వరకు సురక్షితమో తెలుసుకునేందుకు ఇటీవలే ఫేజ్‌-2 ట్రయల్స్‌ పూర్తయ్యాయి. బీసీజీతో ఈ టీకాను పోల్చిచూసేందుకు నవజాత శిశువులపై డబుల్‌ బ్లైండ్‌, కంట్రోల్డ్‌ ఫేజ్‌-3 క్లినికల్‌ ట్రయల్స్‌ నిరుడు ప్రారంభించారు. ఇం దులో దక్షిణాఫ్రికాలో 7వేల మంది, మడగాస్కర్‌ నుంచి 60, సెనెగల్‌ నుంచి 60మంది పిల్లలకు టీకాలు వేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు 1900మంది పైచిలుకు పిల్లలకు ఈ టీకా లు వేశారు. దక్షిణాఫ్రికాలో 276 మంది హెచ్‌ఐవీ సోకిన పెద్దలకు ఫేజ్‌-2 ట్రయల్స్‌లో భాగంగా ఈ టీకా ఇచ్చారు. ఫేజ్‌-2బీ ఎఫికసీ ట్రయల్స్‌లో సబ్‌సహారన్‌ ఆఫ్రికాలో కౌమారంలో ఉన్నవారికి టీకా ఇవ్వనున్నారు.

Updated Date - Mar 25 , 2024 | 04:46 AM