Share News

ధనిక రైతులపై పన్ను .. కేంద్రం యోచన

ABN , Publish Date - Jan 18 , 2024 | 03:05 AM

కేంద్రప్రభుత్వం దేశంలోని ధనిక రైతులకు పన్ను విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పేద రైతులను ఆదుకునేందుకు వారి ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేస్తున్న ప్రభుత్వం, సంపన్న రైతుల నుంచి పన్నులు వసూలు చేసేందుకు

ధనిక రైతులపై పన్ను .. కేంద్రం యోచన

న్యూఢిల్లీ, జనవరి 17: కేంద్రప్రభుత్వం దేశంలోని ధనిక రైతులకు పన్ను విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పేద రైతులను ఆదుకునేందుకు వారి ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేస్తున్న ప్రభుత్వం, సంపన్న రైతుల నుంచి పన్నులు వసూలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ప్రకటన సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ దీనిని ప్రకటించే అవకాశముంది. రైతుల ఖాతాలకు నగదు జమ చేయడం రుణాత్మక వ్యయం అని రిజర్వ్‌ బ్యాంకు మానిటరీ పాలసీ కమిటీ మెంబర్‌ ఆషిమా గోయల్‌ అన్నారు. సంపన్న రైతుల నుంచి పన్నులు వసూలు చేసి, పన్నుల పద్ధతిలో పారదర్శకత తీసుకువచ్చేందుకు కేంద్రం అడుగులు వేస్తోందని ఆమె పేర్కొన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 08:39 AM