తృణమూల్‌కు తపస్ రాయ్ రాజీనామా
ABN , Publish Date - Mar 06 , 2024 | 03:30 AM
తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తపస్ రాయ్ సోమవారం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

కోల్‌కతా, మార్చి 5: తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తపస్ రాయ్ సోమవారం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన 1996 నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడం గమనార్హం. మున్సిపాలిటీ ఉద్యోగాల భర్తీలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈడీ తన నివాసంలో సోదాలు చేసినా సీఎం మమత మాటమాత్రంగా ఖండించలేదంటూ కినుక వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు. తాను ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఏనాడూ మెడికల్ బిల్లులు పెట్టుకోలేదని, అలాంటిది తనపై ఈడీ దాడులు జరిగాయని వాపోయారు. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.