Share News

ప్రధాని మోదీ, ఎంపీ అనురాగ్‌పై చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:56 AM

సభలో అవాస్తవాలు మాట్లాడడంతోపాటు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ,

ప్రధాని మోదీ, ఎంపీ అనురాగ్‌పై చర్యలు తీసుకోండి

లోక్‌సభ స్పీకర్‌కు కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్కమ్‌ ఠాగూర్‌ లేఖ

న్యూఢిల్లీ, జూలై 4: సభలో అవాస్తవాలు మాట్లాడడంతోపాటు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్కమ్‌ ఠాగూర్‌ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించిన ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ సభలో మాట్లాడుతూ.. ప్రతీ మహిళకు నెలకు రూ.8500 ఇస్తామని కాంగ్రెస్‌ తప్పుడు హామీ ఇచ్చిందని అన్నారని మాణిక్కమ్‌ ఠాగూర్‌ లేఖలో పేర్కొన్నారు. కానీ, ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ హామీని అమలు చేస్తామని కాంగ్రెస్‌ చెప్పిందని వివరించారు. వివిధ అంశాలపై ప్రధాని తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ లేఖలో పేర్కొన్నారు. ఇక, ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ కూడా కాంగ్రె్‌సపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆయన తెలిపారు.

Updated Date - Jul 05 , 2024 | 07:14 AM