Share News

బుల్డోజర్‌ న్యాయంపై నేడు తీర్పు

ABN , Publish Date - Nov 13 , 2024 | 06:04 AM

నిబంధనలకు విరుద్ధంగా ఒక్క ఇల్లును కూల్చివేసినా అది రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొన్న సుప్రీంకోర్టు ‘బుల్డోజర్‌ న్యాయం’పై బుధవారం తీర్పు వెలువరించనుంది. ఇలాంటి సందర్భాల్లో వ్యవహరించాల్సిన విషయమై దేశం మొత్తానికి వర్తించే

బుల్డోజర్‌ న్యాయంపై నేడు తీర్పు

న్యూఢిల్లీ, నవంబరు 12: నిబంధనలకు విరుద్ధంగా ఒక్క ఇల్లును కూల్చివేసినా అది రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొన్న సుప్రీంకోర్టు ‘బుల్డోజర్‌ న్యాయం’పై బుధవారం తీర్పు వెలువరించనుంది. ఇలాంటి సందర్భాల్లో వ్యవహరించాల్సిన విషయమై దేశం మొత్తానికి వర్తించే విధంగా మార్గదర్శకాలను సూచించనుంది. నేరాల్లో ప్రమేయం ఉందన్న నెపంతో రాష్ట్ర ప్రభుత్వాలు పలువురి ఇళ్లను కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యలపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం తుది తీర్పు ఇవ్వనుంది.

Updated Date - Nov 13 , 2024 | 06:04 AM