Share News

Supreme Court: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. 56 మంది సీనియర్ అడ్వకేట్‌లలో ఒకే ఒక్క తెలుగోడు

ABN , Publish Date - Jan 19 , 2024 | 09:30 PM

దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు శుక్రవారం 56 మంది న్యాయవాదులను సీనియర్ న్యాయవాదులుగా నియమించింది. జనవరి 19వ తేదీన జరిగిన కోర్టు సమావేశంలో.. భారత ప్రధాన న్యాయమూర్తి, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 56 మంది అడ్వకేట్‌లను సీనియర్ న్యాయవాదులుగా నియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారని సుప్రీంకోర్టు జారీ చేసిన నోటిఫికేషన్ పేర్కొంది.

Supreme Court: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. 56 మంది సీనియర్ అడ్వకేట్‌లలో ఒకే ఒక్క తెలుగోడు

దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు శుక్రవారం 56 మంది న్యాయవాదులను సీనియర్ న్యాయవాదులుగా నియమించింది. జనవరి 19వ తేదీన జరిగిన కోర్టు సమావేశంలో.. భారత ప్రధాన న్యాయమూర్తి, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 56 మంది అడ్వకేట్‌లను సీనియర్ న్యాయవాదులుగా నియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారని సుప్రీంకోర్టు జారీ చేసిన నోటిఫికేషన్ పేర్కొంది. ఈ 56 మందిలో ఒక తెలుగు వ్యక్తి చోటు దక్కించుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీధర్ పోతరాజు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ (ఆన్ రికార్డ్)గా నియమితులయ్యారు. ఆయన ఓయూలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ నుంచి బీకాం పూర్తి చేశారు. 1994లో క్యాంపస్ లా సెంటర్‌లో ప్రవేశ పరీక్షలో అర్హత సాధించారు. ఈ 56 మంది సీనియర్ అడ్వకేట్‌లతో పాటు 198 కొత్త అడ్వకేట్ ఆన్ రికార్డ్‌లు కూడా నియమితులయ్యారు. ఈ సందర్భంగా.. భారత ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్ కొత్తగా నమోదు చేసుకున్న AoRలను అభినందించారు. పలువురు మహిళా న్యాయవాదులు ఏఓఆర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - Jan 19 , 2024 | 09:30 PM