Share News

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ద్వంద్వ ప్రయోజనాలు పొందలేరు

ABN , Publish Date - Dec 31 , 2024 | 03:56 AM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల విషయమై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. ప్రమోషన్లు, అధిక జీత భత్యాల కోసం అమలయిన రెండు పథకాల కింద ఉద్యోగులు ప్రయోజనం పొందలేరని తేల్చి చెప్పింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ద్వంద్వ ప్రయోజనాలు పొందలేరు

ప్రమోషన్ల విధానంపై సుప్రీం స్పష్టత

న్యూఢిల్లీ, డిసెంబరు 30: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల విషయమై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. ప్రమోషన్లు, అధిక జీత భత్యాల కోసం అమలయిన రెండు పథకాల కింద ఉద్యోగులు ప్రయోజనం పొందలేరని తేల్చి చెప్పింది. ఒక వేళ అలా లబ్ధి పొందిన ఉద్యోగులు ఉంటే వారి నుంచి అదనంగా పొందిన సొమ్మును తిరిగి వసూలు చేయాలని ఆదేశించింది. పదోన్నతులు కల్పించేందుకు 1999 ఆగస్టు 9 నుంచి 2008 ఆగస్టు 8 వరకు అస్స్యూర్డ్‌ కెరీర్‌ ప్రోగ్రెసెన్‌ స్కీం (ఏసీపీఎస్‌) అమలయింది. 2008లో మోడిఫైడ్‌ అస్స్యూర్డ్‌ కెరీర్‌ ప్రోగ్రెసెన్‌ స్కీం (ఎంఏసీపీఎస్‌) అమల్లోకి తెచ్చారు. ఎంఏసీపీఎస్‌ పాతతేదీ(2006) నుంచి వర్తింపజేయడంతో కొందరు రెండు విధానాల కింద లబ్ధి పొందారు.

Updated Date - Dec 31 , 2024 | 03:56 AM