బాల్య వివాహాల కట్టడికి విద్యార్థినులకు స్టైపెండ్!
ABN , Publish Date - Jun 13 , 2024 | 04:58 AM
బాల్యవివాహాల కట్టడికి అసోం ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. 11వ తరగతి నుంచి పీజీ వరకు చదివే విద్యార్థినులకు ప్రతినెలా స్టైపెండ్ ఇవ్వాలని నిర్ణయించింది.
గువాహటి, జూలై 12: బాల్యవివాహాల కట్టడికి అసోం ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. 11వ తరగతి నుంచి పీజీ వరకు చదివే విద్యార్థినులకు ప్రతినెలా స్టైపెండ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ‘నిజుత్ మోయినా’ పేరిట ప్రతిపాదించిన పథకానికి కేబినేట్ నుంచి ఆమోదం లభించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ బుధవారం వెల్లడించారు. పథకం కింద 11, 12వ తరగతులు చదివే అమ్మాయిలకు నెలకు రూ.1000, డిగ్రీ చదివే యువతులకు నెలకు రూ.1250, పీజీ చదివే అమ్మాయిలకు రూ.2500 చొప్పున అందించనున్నట్లు ఆయన వివరించారు. ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థినులకు పెళ్లికాకపోతేనే ఈ పథకానికి అర్హులని, పీజీ విద్యార్థినులు మాత్రం పెళ్లైనా ఈ పథకం కింద లబ్ధి పొందవచ్చని తెలిపారు.