Share News

సరయూ నది ఒడ్డున ‘రామాయణ ఆధ్యాత్మిక వనం’

ABN , Publish Date - Jan 12 , 2024 | 05:43 AM

అయోధ్యను సందర్శించే భక్తులు నగరంలోని సరయూ నది ఒడ్డున నిర్మితమవుతున్న ‘రామాయణ ఆధ్యాత్మిక వనాన్ని’ సందర్శించడం ద్వారా శ్రీరాముడి 14ఏళ్ల వనవాసం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవచ్చు.

సరయూ నది ఒడ్డున ‘రామాయణ ఆధ్యాత్మిక వనం’

వనవాసంలో శ్రీరాముడి ప్రయాణ విశేషాలతో ప్రాజెక్టు

న్యూఢిల్లీ, జనవరి 11: అయోధ్యను సందర్శించే భక్తులు నగరంలోని సరయూ నది ఒడ్డున నిర్మితమవుతున్న ‘రామాయణ ఆధ్యాత్మిక వనాన్ని’ సందర్శించడం ద్వారా శ్రీరాముడి 14ఏళ్ల వనవాసం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవచ్చు. రామాయణ వైభవాన్ని ప్రదర్శించే ఓపెన్‌ ఎయిర్‌ మ్యూజియంను తలపించేలా ఈ వనం పర్యావరణహితంగా ఉండనుంది. అయోధ్య మా స్టర్‌ ప్లాన్‌లో భాగంగా దీన్ని సిద్ధం చేస్తున్నారు. శ్రీరాముడు, రామాయణం, అయోధ్యతో పాటు సరయూ నది కూడా హిందూమతం నుంచి విడతీయరాని భాగమని అయోధ్య పునరాభివృద్ధి ప్రాజెక్టు చీఫ్‌ ప్లానర్‌ దిక్షు కుక్రేజా అన్నారు. నది ఒడ్డు వెంబడి ప్రతిపాదిత ఆధ్యాత్మిక వనాన్ని రామాయణం ఇతివృత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందు లో రాముడు వనవాస సమయంలో చేసిన ప్ర యాణాన్ని ప్రత్యేకంగా వివరించినట్లు తెలిపారు. ఈ వనం భక్తులతో పాటు పర్యాటకులను, ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుందని చెప్పారు.

22న అయోధ్యకు

100 చార్టర్డ్‌ విమానాలు: సీఎం యోగి

రామమందిర ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించే జనవరి 22న సుమారు 100 వరకూ చార్డర్డ్‌ విమానాలు అయోధ్య విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతాయని భావిస్తున్నామని యూపీ సీఎం యోగి అన్నారు. గత ఏడాది డిసెంబరు 30న ప్రధాని ప్రారంభించిన మహర్షి వాల్మీ కి విమానాశ్రయం సామర్థ్యానికి ఇదో పరీక్షగా పేర్కొన్నారు. రాష్ట్రానికి నాలుగో అంతర్జాతీయ విమానాశ్రయా న్ని ఇచ్చినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jan 12 , 2024 | 06:42 AM