Share News

పిల్లలు పోర్న్‌ చూడకుండా స్పెయిన్‌ ఫోన్‌ యాప్‌

ABN , Publish Date - Jul 08 , 2024 | 05:13 AM

సెల్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చి చిన్నపిల్లలు అశ్లీల చిత్రాల వీక్షణకు బానిసలైపోతున్న నేపథ్యంలో స్పెయిన్‌ అప్రమత్తమైంది. పిల్లలు ‘పోర్న్‌’ సైట్లను చూడకుండా నిరోధించేందుకు కార్టెరా డిజిటల్‌ బీటా పేరుతో ఓ యాప్‌ను అభివృద్ధి చేసింది. ఒక్కముక్కలో చెప్పాలంటే.. పెద్దలు మాత్ర మే చూడాల్సిన కంటెంట్‌ను చూడ్డానికి ప్రభుత్వం ‘పెద్దలకు మాత్రమే’

పిల్లలు పోర్న్‌ చూడకుండా స్పెయిన్‌ ఫోన్‌ యాప్‌

మాడ్రిడ్‌, జూలై 7: సెల్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చి చిన్నపిల్లలు అశ్లీల చిత్రాల వీక్షణకు బానిసలైపోతున్న నేపథ్యంలో స్పెయిన్‌ అప్రమత్తమైంది. పిల్లలు ‘పోర్న్‌’ సైట్లను చూడకుండా నిరోధించేందుకు కార్టెరా డిజిటల్‌ బీటా పేరుతో ఓ యాప్‌ను అభివృద్ధి చేసింది. ఒక్కముక్కలో చెప్పాలంటే.. పెద్దలు మాత్ర మే చూడాల్సిన కంటెంట్‌ను చూడ్డానికి ప్రభుత్వం ‘పెద్దలకు మాత్రమే’ ఇచ్చే ‘పోర్న్‌ పాస్‌పోర్ట్‌’ అన్నమాట. ఈ యాప్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుని పిల్లలు నీలిచిత్రాలు చూడకుండా ఆపొచ్చు. సెల్‌ఫోన్‌లో అశ్లీల కంటెంట్‌ చూడాలనుకునేవారు ప్రభు త్వం జారీ చేసిన గుర్తింపు కార్డుల ద్వారా వయసును ధ్రువీకరించుకున్నాక యాప్‌ 30 ‘పోర్న్‌ క్రెడిట్స్‌’ను ఇస్తుంది. వాటితో నెల రోజులు నీలిచిత్రాలు చూడొచ్చు. కంప్యూటర్‌లో పోర్న్‌ సైట్లు చూడాలంటే ఒక్కో క్రెడిట్‌ ఒక్కో క్యూఆర్‌ కోడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. మొబైల్‌తో దాన్ని స్కాన్‌ చేసి వేలిముద్ర, ఫేస్‌ రికగ్నిషన్‌, పిన్‌ నంబర్‌, ప్యాటర్న్‌ ద్వారా వయసును ధ్రువీకరించుకోవాలి. సెల్‌ఫోన్‌లోనే చూడాలనుకుంటే క్యూఆర్‌ కోడ్‌ అవసరం లేదు. వేలిముద్ర, ఫేస్‌ రికగ్నిషన్‌ వంటి వాటి ద్వారా సదరు వెబ్‌సైట్లను యాక్సెస్‌ చేయొచ్చు. పిల్లలు తమ వేలిముద్రను ఆ ఫోన్‌లో నమోదు చేసుకున్నా యాప్‌లో వయసు ధ్రువీకరించుకునేందుకు వాడిన వేలిముద్ర వారి తల్లిదండ్రులది అయి ఉంటుంది కాబట్టి ఆ సైట్లు వారి వేలిముద్రతో తెరచుకోవు. పెద్దలు ఒక్కో క్రెడిట్‌తో ఒక పోర్న్‌ సైట్‌ను పదిసార్లు చూడొచ్చు. నెలలోపే 30 క్రెడిట్లు అయిపోతే ఎన్నిసార్లైనా రెన్యూ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు పోర్న్‌ చూడకుండా నిరోధించడమే ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి పెద్దలకెలాంటి పరిమితీ విధించలేదు.

Updated Date - Jul 08 , 2024 | 05:13 AM