స్నేహితులందరికీ ‘సీత’!
ABN , Publish Date - Sep 13 , 2024 | 05:28 AM
దేశం మొత్తానికీ సీతారాం ఏచూరి అంటే వామపక్ష దిగ్గజం! కానీ.. స్నేహితులంతా ఆయన్ను ఆప్యాయంగా ‘సీతా’ అని పిలుచుకునేవారని ప్రముఖ ఆర్థిక వేత్త, జేఎన్‌యూ ప్రొఫెసర్..
దేశం మొత్తానికీ సీతారాం ఏచూరి అంటే వామపక్ష దిగ్గజం! కానీ.. స్నేహితులంతా ఆయన్ను ఆప్యాయంగా ‘సీతా’ అని పిలుచుకునేవారని ప్రముఖ ఆర్థిక వేత్త, జేఎన్‌యూ ప్రొఫెసర్.. సీపీ చంద్రశేఖర్ తెలిపారు. సీతారాం ఏచూరి గురించి ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పార్టీకి విధేయుడిగా ఉంటూనే.. భారతదేశ రాజకీయ యవనికపై ప్రజాస్వామిక శక్తులతో వ్యవహరించే క్రమంలో కొంత పట్టువిడుపుల ధోరణితో వ్యవహరించాలని ఏచూరి భావించేవారని తెలిపారు. గడిచిన దశాబ్దకాలంలో భారత రాజకీయాలు నియంతృత్వం దిశగా మలుపు తీసుకున్న నేపథ్యంలో ఏచూరిలో ఆ దృక్పథం మరింత బలపడిందని వెల్లడించారు.