Share News

అయోధ్యలో సిద్దిపేట లంగర్‌

ABN , Publish Date - Jan 21 , 2024 | 04:46 AM

అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ ఏర్పాట్లలో భాగంగా సిద్దిపేటకు చెందిన అమర్‌నాథ్‌ అన్నదాన సేవాసమితికి అరుదైన అవకాశం దక్కింది. అయోధ్యలో భోజన లంగర్‌ను ఏర్పాటు

అయోధ్యలో సిద్దిపేట లంగర్‌

సిద్దిపేట, జనవరి 20(ఆంధ్రజ్యోతి): అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ ఏర్పాట్లలో భాగంగా సిద్దిపేటకు చెందిన అమర్‌నాథ్‌ అన్నదాన సేవాసమితికి అరుదైన అవకాశం దక్కింది. అయోధ్యలో భోజన లంగర్‌ను ఏర్పాటు చేసేందుకు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు నుంచి అనుమతి లభించింది. అమర్‌నాథ్‌ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో గత 12ఏళ్లుగా కశ్మీర్‌లోని అమర్‌నాథ్‌ ఆలయం వద్ద అన్నదానం చేస్తున్నారు. సేవాసమితి చిత్తశుద్ధిని గుర్తించి ట్రస్టు ఈ అవకాశం అందించినట్లుగా భావిస్తున్నారు. ఈ సేవాసమితి ఆధ్వర్యంలో అయోధ్యలో ఇప్పటికే అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు ఉచితంగా 3 పూటలు అన్నదానం చేయనున్నారు. ఆహార పదార్థాలు, ఇతర సామగ్రి తీసుకువెళ్లే లారీలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఇటీవలే జెండా ఊపి ప్రారంభించారు. ఆయన కూడా ఈ సేవాసమితిలో సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం అయోధ్య భోజన లంగర్‌లో నిత్యం 2వేల మందికి అన్నదానం చేస్తున్నామని, 22వ తేదీ నుంచి రోజుకు 10వేల మంది ఉచిత భోజనానికి ఏర్పాట్లు చేశామని నిర్వాహకుడు నేతి కైలాసం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - Jan 21 , 2024 | 04:46 AM