Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

పాక్‌ ప్రధానిగా షహబాజ్‌

ABN , Publish Date - Mar 04 , 2024 | 04:42 AM

పాకిస్థాన్‌ నూతన ప్రధానమంత్రిగా పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) అధ్యక్షుడు షహబాజ్‌ షరీఫ్‌(72) వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు.

పాక్‌ ప్రధానిగా షహబాజ్‌

ఇస్లామాబాద్‌, మార్చి 3: పాకిస్థాన్‌ నూతన ప్రధానమంత్రిగా పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) అధ్యక్షుడు షహబాజ్‌ షరీఫ్‌(72) వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. నేషనల్‌ అసెంబ్లీలో ఆదివారం నిర్వహించిన ఓటింగ్‌లో పీఎంఎల్‌-ఎన్‌, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ) తరఫు అభ్యర్థి షహబాజ్‌కు 201 ఓట్లు వచ్చాయి. మొత్తం 336మంది సభ్యుల పార్లమెంట్‌లో సభా నాయకుడు కావడానికి అవసరమైన దానికంటే ఆయన 32ఓట్లు ఎక్కువ సాధించారు. షహబాజ్‌ ప్రత్యర్థి, పాకిస్థాన్‌ తెహ్రిక్‌-ఇ-ఇన్సా్‌ఫ(పీటీఐ) అభ్యర్థి ఒమర్‌ ఆయూబ్‌ ఖాన్‌కు 92 ఓట్లు వచ్చాయి. దీంతో పాక్‌ 24వ ప్రధానిగా షహబాజ్‌ను నియమిస్తూ నేషనల్‌ అసెంబ్లీ స్పీకర్‌ సర్దార్‌ అయాజ్‌ సాదిక్‌ ప్రకటన చేశారు. ఐవాన్‌-ఎ-సదర్‌లోని అధ్యక్ష భవనంలో సోమవారం షహబాజ్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఓటింగ్‌ నేపథ్యంలో పీటీఐ మద్దతు కలిగిన చట్ట సభ్యుల నినాదాలు, గందరగోళ పరిస్థితుల మధ్య కొత్త పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా, షహబాజ్‌ ఆదివారం తన ప్రసంగంలో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. కశ్మీర్‌, పాలస్తీనాలకు స్వాతంత్య్రం ఉండాలన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 08:15 AM