జియో సేవలకు తీవ్ర విఘాతం
ABN , Publish Date - Sep 18 , 2024 | 06:43 AM
దేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో సేవలకు మంగళవారం ఉదయం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా ముంబై సర్కిల్‌తో
ముంబై, సెప్టెంబరు 17: దేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో సేవలకు మంగళవారం ఉదయం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా ముంబై సర్కిల్‌తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో లక్షలాది మంది వినియోగదారులు కాలింగ్, ఇంటర్నెట్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాంతో ఎక్స్ సహా ఇతర మాధ్యమాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. టెక్నాలజీ సేవల విఘాతాలను పర్యవేక్షించే డౌన్‌డిటెక్టర్ వెబ్‌సైట్ ప్రకారం.. జియో మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీతో పాటు ఫైబర్ ఇంటర్నెట్ సేవలకూ అంతరాయం ఏర్పడింది. జియో ఐడీసీ డేటా సెంటర్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదమే ఇందుకు కారణమని రాయిటర్స్ కథనం పేర్కొంది. కానీ, కంపెనీ ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. వినియోగదారులకు క్షమాపణలు తెలిపిన జియో.. సేవల అంతరాయానికి చిన్న సాంకేతిక సమస్యే కారణమని పేర్కొంది. సమస్యను పరిష్కరించామని, సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించామని తెలిపింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై సహా అనేక నగరాల్లో జియో సేవలకు అంతరాయం కలిగింది.