Share News

58th Jnanpith Award: ఈసారి జ్ఞాన్‌పీఠ్ పురస్కారం ఎవరెవరికంటే..?

ABN , Publish Date - Feb 17 , 2024 | 08:00 PM

58వ జ్ఞాన్‌పీఠ్ అవార్డును జ్ఞాన్‌పీఠ్ ఎంపిక కమిటీ శనివారంనాడు ప్రకటించింది. ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్ , సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యలను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.

58th Jnanpith Award: ఈసారి జ్ఞాన్‌పీఠ్ పురస్కారం ఎవరెవరికంటే..?

న్యూఢిల్లీ: 58వ జ్ఞాన్‌పీఠ్ అవార్డును (58th Jnanpith Award) జ్ఞాన్‌పీఠ్ ఎంపిక కమిటీ శనివారంనాడు ప్రకటించింది. ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్ (Gulzar), సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య (Swamy Rambhadracharya)లను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. రెండు వేర్వేరు భాషల్లో విశేష కృషి చేసినందుకు గాను 2023 సంవత్సరానికి గాను ఈ అవార్డును ప్రకటించారు.


గుల్జార్..

బాలీవుడ్ సినిమారంగంలో రచయితగా తనకంటూ గుల్జార్ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఈ దశాబ్దపు ఉత్తమ ఉర్దూ కవులలో ఒకరుగా నిలిచారు. 2002లో ఉర్దూలో సాహిత్య అకాడమి అవార్డును అందుకున్నారు. 2013లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2004లో పద్మ భూషణ్ పొందారు. ఐదు జాతీయ స్థాయి సినీ అవార్డులను సొంతం చేసుకున్నారు.


రామ్‌భద్రాచార్య

హిందూ ఆధ్యాత్మిక గురువుగా రామ్‌భద్రాచార్యకు మంచి పేరుంది. చిత్రకూఠ్‌లోని తులసి పీఠ్‌ వ్యవస్థాపకుడుగా, అధిపతిగా ఆయన ఉన్నారు. విద్యావేత్తగా, రచయితగా 100కి పైగా పుస్తకాలు రాశారు. ''రెండు భాషల్లో విశిష్ఠ కృషి చేసిన ఇద్దరికి 2023 సంవత్సరానికి జ్ఞానపీఠ్ అవార్డు ఇవ్వాలని నిర్ణయించాం. సంస్కృత సాహిత్యంలో విశిష్ట కృషి చేసిన జగద్గురు రామ్‌భద్రాచార్య, ఉర్దూ సాహిత్యానికి కృషి చేసిన గుల్జార్‌‌ను ఎంపిక చేశాం'' అని జ్ఞాన్‌పీఠ్ ఎంపిక కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - Feb 17 , 2024 | 09:11 PM