ఏఆర్ రెహ్మాన్‌పై దుష్ప్రచారం వద్దు
ABN , Publish Date - Nov 25 , 2024 | 03:18 AM
ఏఆర్ రెహ్మాన్‌పై దుష్ప్రచారాన్ని ఆపాలని ఆయన సతీమణ సైరాభాను తమిళ మీడియా, యూట్యూబర్లను కోరారు.
తమిళ మీడియాకు సైరాభాను వినతి
చెన్నై, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఏఆర్ రెహ్మాన్‌పై దుష్ప్రచారాన్ని ఆపాలని ఆయన సతీమణ సైరాభాను తమిళ మీడియా, యూట్యూబర్లను కోరారు. ఈ మేరకు ఆదివారం ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. 2నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న తాను చికిత్స నిమిత్తం ప్రస్తుతం ముంబైలో ఉన్నానని ఆమె వెల్లడించారు. ఏఆర్ రెహ్మాన్‌కు ఉన్న విపరీతమైన పని ఒత్తిడి వల్లే తాను ఆయనకు దూరంగా వెళ్లినట్టు వివరించారు. అద్భుతమైన వ్యక్తి, మానవతావాది అయిన రెహ్మాన్‌ఫై తమిళ మీడియా, యూట్యూబర్లు తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేయడం సరికాదని అన్నారు. రెహ్మాన్‌ను ప్రాణం కంటే మిన్నగా విశ్వసిస్తున్నానని, ఆరాధిస్తున్నానని తెలిపారు.