Share News

రష్యా ప్రతిపక్ష నేత నావల్నీ జైలులో మృతి

ABN , Publish Date - Feb 17 , 2024 | 03:08 AM

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ బద్ధశత్రువు, ప్రభుత్వ అవినీతిపై ఉద్యమించిన ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ (47) శుక్రవారం జైలులో మరణించినట్టు ప్రిజన్‌ సర్వీస్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

రష్యా ప్రతిపక్ష నేత నావల్నీ జైలులో మృతి

మాస్కో, ఫిబ్రవరి 16: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ బద్ధశత్రువు, ప్రభుత్వ అవినీతిపై ఉద్యమించిన ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ (47) శుక్రవారం జైలులో మరణించినట్టు ప్రిజన్‌ సర్వీస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ‘జైలులో కొంతసేపు నడిచిన తర్వాత ఆయన అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయారు. వెంటనే వైద్య సిబ్బంది వచ్చి పరీక్షించారు. అయితే ఆయనను కాపాడేందుకు చేసే ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన మరణించారని వైద్య సిబ్బంది ధ్రువీకరించారు. ఆయన మృతికి కారణాలు తెలియాల్సి ఉంద’ని ఆ ప్రకటన వివరించింది. నావల్నీ తీవ్రవాద అభియోగాలతో పాటు పలు కేసుల్లో 19 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. రష్యాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నావల్నీ మృతి అనుమానాలు రేకెత్తిస్తోంది. కాగా, 2020లో సెర్బియా పర్యటనలో ఉన్నప్పుడు నావల్నీపై విషప్రయోగం జరగడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

Updated Date - Feb 17 , 2024 | 08:29 AM