ఆరెస్సెస్ చీఫ్ భాగవత్‌తో యోగి ఏకాంత చర్చలు
ABN , Publish Date - Jun 17 , 2024 | 05:54 AM
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భాగవత్‌తో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏకాంతంగా చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకొంది. యోగి స్వస్థలమైన గోరఖ్‌పూర్‌లో శనివారం రెండుసార్లు ఈ భేటీలు జరిగాయి. తొలుత మధ్యాహ్నం కాంపెయిర్‌గంజ్‌లో

ఒకే రోజున రెండు సార్లు.. యూపీలో బీజేపీ ఓటమిపైనేనా?
గోరఖ్‌పూర్, జూన్ 16: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భాగవత్‌తో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏకాంతంగా చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకొంది. యోగి స్వస్థలమైన గోరఖ్‌పూర్‌లో శనివారం రెండుసార్లు ఈ భేటీలు జరిగాయి. తొలుత మధ్యాహ్నం కాంపెయిర్‌గంజ్‌లో ఆరెస్సెస్ కార్యకర్తల సమావేశం జరిగిన అనంతరం అక్కడి పాఠశాలలో ఇరువురు నేతలు అరగంట పాటు చర్చలు జరిపారు. రాత్రి 8.30 గంటల సమయంలో పక్కీబాగ్‌లోని సరస్వతి శిశుమందిర్‌లో మరో 30 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ బలంగా ఉందని అందరూ భావిస్తుండగా ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడానికిగల కారణాలపై చర్చించినట్టు తెలుస్తోంది. కాగా కంటి ఆపరేషన్ నిమిత్తం రిషీకేష్ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన తన తల్లి గాయత్రి దేవిని ఆదివారం యోగి ఆదిత్యనాథ్ పరామర్శించారు. సుమారు మూడు గంటల పాటు ఆస్పత్రిలో ఉన్నారు.