Share News

బలికోరుతున్న రోడ్లు

ABN , Publish Date - Nov 13 , 2024 | 06:02 AM

దేశంలో రహదారులు బలికోరుతున్నాయి..! రహదారులు.. వనరులు అభివృద్ధి చెందుతున్నా.. ఏటా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయే తప్ప.. తగ్గడం లేదు. చట్టాలు కఠినంగా లేకపోవడం.. జరిమానాలు సాధారణంగా ఉండడంతో నిర్లక్ష్య డ్రైవింగ్‌,

బలికోరుతున్న రోడ్లు

10 ఏళ్లలో 15.3 లక్షల మంది మృతి

న్యూఢిల్లీ, నవంబరు 12: దేశంలో రహదారులు బలికోరుతున్నాయి..! రహదారులు.. వనరులు అభివృద్ధి చెందుతున్నా.. ఏటా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయే తప్ప.. తగ్గడం లేదు. చట్టాలు కఠినంగా లేకపోవడం.. జరిమానాలు సాధారణంగా ఉండడంతో నిర్లక్ష్య డ్రైవింగ్‌, రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట పడడం లేదని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. 2014-23 మధ్యకాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య 15.3 లక్షలుగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రోడ్లు, వనరులను ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తున్నా.. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే ఘోర ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2012లో దేశవ్యాప్తంగా 48.6 లక్షల కిలోమీటర్ల మేర రోడ్లు ఉండగా.. 2019 కల్లా.. 63.3 లక్షల కిలోమీటర్లకు పెరిగాయి. అదే సమయంలో.. 2012లో 15.9 కోట్లుగా ఉన్న వాహనాలు.. 2024 అక్టోబరు కల్లా.. 38.3 కోట్లకు చేరుకున్నాయి. వాహనాలు రెండింతల కంటే ఎక్కువ పెరిగినా.. అందుకు తగ్గట్లు వనరులు అభివృద్ధి కావట్లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Nov 13 , 2024 | 06:02 AM