Share News

పదేళ్ల గరిష్ఠానికి రిజర్వాయర్లు

ABN , Publish Date - Aug 21 , 2024 | 05:26 AM

దేశంలోని జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ప్రస్తుత నీటి నిల్వలు పదేళ్ల సగటుతో పోల్చుకుంటే 14ు పెరిగాయి. ఇది ఈ ఏడాది గణనీయమైన పెరుగుదల అని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) పేర్కొంది. తాజాగా దేశంలోని రిజర్వాయర్ల నీటిమట్టాల వివరాలను

పదేళ్ల గరిష్ఠానికి రిజర్వాయర్లు

న్యూఢిల్లీ, ఆగస్టు 20: దేశంలోని జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ప్రస్తుత నీటి నిల్వలు పదేళ్ల సగటుతో పోల్చుకుంటే 14ు పెరిగాయి. ఇది ఈ ఏడాది గణనీయమైన పెరుగుదల అని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) పేర్కొంది. తాజాగా దేశంలోని రిజర్వాయర్ల నీటిమట్టాల వివరాలను సీడబ్ల్యూసీ విడుదల చేసింది. దీని ప్రకారం.. 150 భారీ రిజర్వాయర్లలో 124 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. ఇది ఆయా జలాశయాల ప్రత్యక్ష నిల్వ సామర్థ్యంలో 69ు. గత ఏడాది ఇదే సమయానికి 111.85 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీరు మాత్రమే నిల్వ ఉండడం గమనార్హం. రిజర్వాయర్ల సాధారణ నీటి నిల్వ 108.79 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు. దీంతో పోల్చుకుంటే.. ప్రస్తుత నిల్వలు పదేళ్ల సగటుతో పోల్చుకుంటే 14 శాతం పెరిగాయి. అయితే.. రాష్ట్రాల వారీగా నీటి నిల్వలను సమీక్షించినప్పుడు కొంత వ్యత్యాసం కనిపిస్తోందని నివేదిక వివరించింది. కాగా, దేశవ్యాప్తంగా వరి విస్తీర్ణం 6ు పెరిగినట్టు కేంద్రం వెల్లడించింది. పత్తి సాగు విస్తీర్ణం గతేడాదితో పోలిస్తే తగ్గిందని తెలిపింది.

Updated Date - Aug 21 , 2024 | 05:26 AM