Share News

సోమ్‌నాథ్‌ ఆలయం వద్ద ఆక్రమణల తొలగింపు

ABN , Publish Date - Jan 28 , 2024 | 01:25 AM

గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమ్‌నాథ్‌ ఆలయం వెనుక నెలకొన్న ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు శనివారం చర్యలు చేపట్టారు. గిర్‌సోమ్‌నాథ్‌ జిల్లాలో సోమ్‌నాథ్‌ ఆలయ ట్రస్ట్‌, రాష్ట్ర

సోమ్‌నాథ్‌ ఆలయం వద్ద ఆక్రమణల తొలగింపు

గిర్‌ సోమ్‌నాథ్‌, జనవరి 27: గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమ్‌నాథ్‌ ఆలయం వెనుక నెలకొన్న ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు శనివారం చర్యలు చేపట్టారు. గిర్‌సోమ్‌నాథ్‌ జిల్లాలో సోమ్‌నాథ్‌ ఆలయ ట్రస్ట్‌, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మూడు హెక్టార్ల భూమిలో భారీగా ఆక్రమణలు నెలకొన్నాయి. అక్కడ 21 ఇళ్లు, 153 గుడిసెల్ని తొలగించినట్లు కలెక్టర్‌ హర్జి వాధ్వానియా తెలిపారు. 100 మంది రెవెన్యూ అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం చేపట్టారు. భద్రతకు భారీ సంఖ్యలో పోలీసుల్ని నియమించారు. రెవెన్యూ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆక్రమణలను తొలగించి ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. సోమ్‌నాథ్‌ ఆలయం గుజరాత్‌లోని వెరావల్‌ పట్టణానికి దగ్గరలో ప్రభాస్‌ పతన్‌ వద్ద అరేబియా సముద్ర తీరంలో ఉంది. శివుడి 12 జ్యోతిర్లంగాల్లో మొదటిది ఈ ఆలయంలో ఉంది.

Updated Date - Jan 28 , 2024 | 01:25 AM