శాకాహారంతో శరీరానికి యవ్వనం
ABN , Publish Date - Jul 30 , 2024 | 12:58 AM
మాంసాహారం తినేవారితో పోలిస్తే శుద్ధ శాకాహారం తీసుకొనేవారిలో వయసు పెరిగినా శరీరం యవ్వనంగా ఉంటుందని అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ అధ్యయనంలో తేలింది.
న్యూఢిల్లీ, జూలై 29: మాంసాహారం తినేవారితో పోలిస్తే శుద్ధ శాకాహారం తీసుకొనేవారిలో వయసు పెరిగినా శరీరం యవ్వనంగా ఉంటుందని అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ అధ్యయనంలో తేలింది. శాస్త్రవేత్తలు 21 మంది కవల జంటల(42మంది)పై అధ్యయనం నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు. అధ్యయనంలో భాగంగా వారు కవలల్లో 21 మంది బృందానికి మాంసాహారం ఇచ్చారు. మిగతా 21మందికి శాకాహారం ఇచ్చారు. ఇలా 8వారాల పాటు ఆహారాన్ని ఇచ్చి పరిశీలించారు. మాంసాహారం తిన్నవారితో పోలిస్తే శాకాహారం తిన్నవారిలో గుండె, కాలేయం, జీర్ణక్రియ వ్యవస్థల పనితీరు మెరుగ్గా ఉన్నట్లు, వారు సగటున 2 కిలోల బరువు తగ్గినట్లు గుర్తించారు.