Share News

MPs : పేపర్‌ లెస్‌ విధానంలో కొత్త ఎంపీల రిజిస్ట్రేషన్‌

ABN , Publish Date - Jun 06 , 2024 | 05:26 AM

సార్వత్రిక ఎన్నికల్లో 18వ లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన ఎంపీల రిజిస్ర్టేషన్‌కు సంబంధించి లోక్‌సభ సచివాలయం సర్వం సిద్ధం చేసింది. సభ్యుల రిజిస్ర్టేషన్‌ ప్రక్రియను పూర్తి చేయడానికి రిజిస్ట్రేషన్‌

MPs : పేపర్‌ లెస్‌ విధానంలో కొత్త ఎంపీల రిజిస్ట్రేషన్‌

న్యూఢిల్లీ, జూన్‌ 5: సార్వత్రిక ఎన్నికల్లో 18వ లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన ఎంపీల రిజిస్ర్టేషన్‌కు సంబంధించి లోక్‌సభ సచివాలయం సర్వం సిద్ధం చేసింది. సభ్యుల రిజిస్ర్టేషన్‌ ప్రక్రియను పూర్తి చేయడానికి రిజిస్ట్రేషన్‌ కౌంటర్లను పార్లమెంట్‌ హౌస్‌ ఎనెక్స్‌లో ఏర్పాటు చేశారు. జూన్‌ 5 నుంచి 14 వరకు ఇవి పని చేయనున్నాయి. పేపర్‌రహితంగా రిజిస్ర్టేషన్‌ ప్రక్రియను చేపట్టనున్నారు. ఈమేరకు ఆన్‌లైన్‌ ఇంటిగ్రేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ ద్వారా రిజిస్ర్టేషన్‌ పూర్తి చేయనున్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా బయో-ప్రొఫైల్‌ డేటాను తీసుకుని ముఖ, బయోమెట్రిక్‌ రికగ్నిషన్‌లను వినియోగించి పార్లమెంట్‌ గుర్తింపు కార్డులు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎ్‌స) కార్డులను జారీ చేస్తారు. 20 డిజిటల్‌ కౌంటర్ల ద్వారా రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ చేపడతారు. ఫొటోగ్రఫీ, ముఖ గుర్తింపు కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు.

Updated Date - Jun 06 , 2024 | 07:35 AM