Share News

ఉపాధికి తగ్గింపు.. ఆవాస్‌కు పెంపు

ABN , Publish Date - Feb 02 , 2024 | 05:05 AM

మధ్యంతర బడ్జెట్‌లో కొన్ని పథకాలకు నిధుల కేటాయింపులను 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే తగ్గించగా, మరికొన్ని పథకాలకు పెంచారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.90,806 కోట్ల నుంచి రూ.86 వేల కోట్లకు, అమృత్‌ నగరాలు, స్మార్ట్‌ సిటీల మిషన్‌కు రూ.15,153 కోట్ల నుంచి రూ.10,400 కోట్లకు తగ్గించాలని ప్రతిపాదించారు.

ఉపాధికి తగ్గింపు.. ఆవాస్‌కు పెంపు

యూరియా సబ్సిడీలో భారీ కోత

రూ.1,65,217 కోట్ల నుంచి రూ.1,19,000 కోట్లకు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): మధ్యంతర బడ్జెట్‌లో కొన్ని పథకాలకు నిధుల కేటాయింపులను 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే తగ్గించగా, మరికొన్ని పథకాలకు పెంచారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.90,806 కోట్ల నుంచి రూ.86 వేల కోట్లకు, అమృత్‌ నగరాలు, స్మార్ట్‌ సిటీల మిషన్‌కు రూ.15,153 కోట్ల నుంచి రూ.10,400 కోట్లకు తగ్గించాలని ప్రతిపాదించారు. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమానికి నిధులను పెంచలేదు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమానికి కొద్దిపాటి నిధుల పెంపును ప్రకటించారు. జాతీయ ఆహార భద్రత కింద ఎఫ్‌పీఎస్‌ డీలర్లకు ఇచ్చే మార్జిన్‌ను రూ.8,572 కోట్ల నుంచి రూ.7,075 కోట్లకు తగ్గించారు. ఇక కేటాయింపులు పెరిగిన పథకాలను చూస్తే.. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనకు రూ.73,615 కోట్ల నుంచి రూ.80,671 కోట్లకు, జలజీవన్‌ మిషన్‌కు రూ.54,700 కోట్ల నుంచి రూ.70,163 కోట్లకు, జాతీయ ఆరోగ్య మిషన్‌కు రూ.33,803 కోట్ల నుంచి రూ.38,183 కోట్లకు, సమగ్ర శిక్షా అభియాన్‌కు రూ.32,515 కోట్ల నుంచి రూ.37,500 కోట్లకు, అంగన్‌వాడి, పోషక్‌ అభియాన్‌లకు రూ.19,876 కోట్ల నుంచి రూ.21,200 కోట్లకు, ప్రధానమంత్రి గ్రామీణ్‌ సడక్‌ యోజనకు రూ.18,783 కోట్ల నుంచి రూ.19,000 కోట్లకు పెంచారు. వీటితోపాటు జాతీయ జీవనోపాధి మిషన్‌ (ఆజీవిక)కు రూ.12,083 కోట్ల నుంచి రూ.15,047 కోట్లకు, ప్రధానమంత్రి కృషి సించాయి యోజనకు రూ.6,380 కోట్ల నుంచి రూ.11,391 కోట్లకు, ప్రఽధానమంత్రి జన ఆరోగ్య యోజనకు రూ.6,186 కోట్ల నుంచి రూ.7,500 కోట్లకు, ఆయుష్మాన్‌ భారత్‌కు రూ.1228 కోట్లనుంచి రూ.4,108 కోట్లకు, స్వచ్ఛ భారత్‌ (గ్రామీణ్‌)కు రూ.4,925 కోట్ల నుంచి రూ.7,192 కోట్లకు, స్వచ్చ భారత్‌ (పట్టణ)కు రూ.1926 కోట్ల నుంచి రూ.5,000 కోట్లకు, కృషోన్నతి యోజనకు కేటాయింపులను రూ.4,716 కోట్ల నుంచి రూ.7,447 కోట్లకు పెంచారు. పంటల బీమా పథకం, ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, అన్నదాత సంరక్షణ యోజన, రైతు ఉత్పత్తి సంఘాలకు, వడ్డీ రాయితీలకు ఈసారి నిధులు భారీగా పెంచారు. పంటల బీమాకు రూ.10,296 కోట్ల నుంచి రూ.14,600 కోట్లకు, కిసాన్‌ సమ్మాన్‌ నిధికి రూ.58,254 కోట్ల నుంచి రూ.60 వేల కోట్లకు, రైతు ఉత్పత్తి సంఘాలకు రూ.124 కోట్ల నుంచి రూ.582 కోట్లకు, వడ్డీ రాయితీలను రూ.17,998 కోట్ల నుంచి రూ.22,600 కోట్లకు పెంచారు. అయితే యూరియా సబ్సిడీ మాత్రం రూ.1,65,217 కోట్ల నుంచి రూ.1,19,000 కోట్లకు తగ్గడం గమనార్హం.

Updated Date - Feb 02 , 2024 | 05:05 AM