Share News

London: రాజ్‌నాథ్ సింగ్ అరుదైన రికార్డు.. 22 ఏళ్ల తరువాత అక్కడ పర్యటన

ABN , Publish Date - Jan 07 , 2024 | 10:19 AM

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) సోమవారం నుండి మూడు రోజులపాటు UKలో పర్యటించనున్నారు. 22 ఏళ్ల తరువాత భారత్ నుంచి రక్షణ శాఖ మంత్రి యూకేలో పర్యటించడం ఇది రెండోసారి.

London: రాజ్‌నాథ్ సింగ్ అరుదైన రికార్డు.. 22 ఏళ్ల తరువాత అక్కడ పర్యటన

లండన్:రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) సోమవారం నుండి మూడు రోజులపాటు UKలో పర్యటించనున్నారు. 22 ఏళ్ల తరువాత భారత్ నుంచి రక్షణ శాఖ మంత్రి యూకేలో పర్యటించడం ఇది రెండోసారి. రాజ్ నాథ్ సింగ్ ఈ రికార్డు క్రియేట్ చేయనున్నారు. 2022లోనే సింగ్ యూకే పర్యటనకి వెళ్లాలనుకున్నారు. ప్రొటోకాల్ వల్ల ఆయన పర్యటన రద్దు అయింది. ఇన్నేళ్ల తరువాత రక్షణ మంత్రి పర్యటించడంపై అధికారులు ఆసక్తిగా ఉన్నారు.

ఆయన తన పర్యటనలో UK కౌంటర్, డిఫెన్స్ సెక్రటరీ గ్రాంట్ షాప్స్‌తో విస్తృత చర్చలు జరుపుతారు. సింగ్ సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్‌ను తనిఖీ చేసి, జాతిపిత మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మారక చిహ్నాలను సందర్శిస్తారు. అనంతరం UKలోని భారత పౌరులతో సమావేశం ఉంటుందని తెలుస్తోంది. "2022లో అప్పటి బీజేపీ ప్రభుత్వంలోని రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ తొలిసారి లండన్ లో పర్యటించారు.

ఆ పర్యటన జరిగిన 22 సంవత్సరాల అనంతరం ఇప్పుడు రాజ్ నాథ్ పర్యటన ఉండనుంది. ఆయన పర్యటనతో ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు మెరుగుతాయి" అని IISS సీనియర్ ఫెలో రాహుల్ రాయ్ చౌదరి తెలిపారు. సెప్టెంబర్ లో భారత అధ్యక్షతన నిర్వహించిన జీ - 20 సమ్మిట్ లో బ్రిటన్ ప్రధాని రిషీ సునక్ పాల్గొన్న తరువాత ఇరుదేశాల మధ్య బంధాలు మరింతగా బలపడ్డాయి.

Updated Date - Jan 07 , 2024 | 10:19 AM