Share News

యూపీలో రాహుల్‌ యాత్ర కుదింపు

ABN , Publish Date - Feb 13 , 2024 | 04:44 AM

కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ జోడో న్యాయ యాత్ర నిడివిని తగ్గించాలని ఆ పార్టీ యోచిస్తున్నట్టు తెలిసింది. దీనికోసం ఉత్తరప్రదేశ్‌ రూట్‌మ్యాప్‌ నుంచి పశ్చిమ నియోజకవర్గాలను చాలావరకు మినహాయించినట్టు సమాచారం. ‘ఇండియా’ భాగస్వామి ఆర్‌ఎల్‌డీ పార్టీ నేత, మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌ మనవడు జయంతి చౌధురికి ఈ నియోజకవర్గాల్లో బలం ఉంది. అయితే,

యూపీలో రాహుల్‌ యాత్ర కుదింపు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ జోడో న్యాయ యాత్ర నిడివిని తగ్గించాలని ఆ పార్టీ యోచిస్తున్నట్టు తెలిసింది. దీనికోసం ఉత్తరప్రదేశ్‌ రూట్‌మ్యాప్‌ నుంచి పశ్చిమ నియోజకవర్గాలను చాలావరకు మినహాయించినట్టు సమాచారం. ‘ఇండియా’ భాగస్వామి ఆర్‌ఎల్‌డీ పార్టీ నేత, మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌ మనవడు జయంతి చౌధురికి ఈ నియోజకవర్గాల్లో బలం ఉంది. అయితే, ఆయన తన తాతయ్యకు భారత రత్న ప్రకటించిన నేపథ్యంలో ఎన్డీయేలోకి చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే ఆ రాష్ట్రంలో యాత్ర మార్గాన్ని కుదించినట్టు వస్తున్న వార్తలను కాంగ్రెస్‌ వర్గాలు ఖండించాయి. ఈ మార్పులకు రెండు కారణాలు ఉన్నట్టు తెలిపాయి. రాహుల్‌ ఎక్కువమందిని కలిసేందుకు వీలుగా యాత్ర వేగాన్ని తగ్గించడానికే కొన్ని నియోజకవర్గాలను మినహాయించినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే, యాత్రను వీలైనంత త్వరగా ముగించుకుని లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఎక్కువ సమయం గడపాలనేదీ దీనికొక కారణమని తెలిపాయి. షెడ్యూల్‌ ప్రకారం వచ్చే నెల 20వ తేదీన ముంబై చేరడంతో యాత్ర ముగియాలి. ఆ రోజు ‘ఇండియా’ భాగస్వాములతో ముంబైలో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోంది.

Updated Date - Feb 13 , 2024 | 08:56 AM