హత్రాస్ బాధితులకు పరిహారం పెంచండి: రాహుల్
ABN , Publish Date - Jul 08 , 2024 | 05:04 AM
హత్రాస్ తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబాలకు నష్టపరిహార మొత్తాన్ని పెంచి, వీలైనంత త్వరగా ఆ మొత్తం అందించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని, వారికి కూడా తగిన నష్టపరిహారం అందించాలని

న్యూఢిల్లీ, జూలై 7 (ఆంధ్రజ్యోతి): హత్రాస్ తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబాలకు నష్టపరిహార మొత్తాన్ని పెంచి, వీలైనంత త్వరగా ఆ మొత్తం అందించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని, వారికి కూడా తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఆయన లేఖ రాశారు. బాధితులకు యూపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం చాలా తక్కువగా ఉందని రాహుల్ అన్నారు. ఘటనకు స్థానిక యంత్రాంగ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని బాధిత కుటుంబాలు తనతో చెప్పాయని ఆయన వివరించారు. ఈ వ్యవహారంపై నిష్పాక్షిక, పారదర్శక దర్యాప్తు జరిపించాలని కోరారు.