Share News

Rahul Gandhi : ప్రజలు విద్వేషాన్ని తిప్పికొట్టారు

ABN , Publish Date - May 26 , 2024 | 07:07 AM

లోక్‌సభ ఎన్నికల మొదటి ఐదు దశల్లో ప్రజలు అబద్ధాలను, విద్వేషాన్ని, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారని, తమ జీవితాలకు సంబంధించిన కీలకాంశాలకు ప్రాధాన్యం ఇచ్చారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ

Rahul Gandhi : ప్రజలు విద్వేషాన్ని తిప్పికొట్టారు

న్యూఢిల్లీ, మే 25: లోక్‌సభ ఎన్నికల మొదటి ఐదు దశల్లో ప్రజలు అబద్ధాలను, విద్వేషాన్ని, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారని, తమ జీవితాలకు సంబంధించిన కీలకాంశాలకు ప్రాధాన్యం ఇచ్చారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ‘అండర్‌కరెంట్‌’లా లభించిన ప్రజా మద్దతుతో ఇండియా కూటమి ఘన విజయం సాధిస్తుందని ప్రియాంకా గాంధీ అన్నారు. వీరిద్దరూ ఢిల్లీలో ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటేశానని కేజ్రీవాల్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ఈ పోస్టును పాక్‌ మాజీ మంత్రి చౌదరి ఫవాద్‌ షేర్‌ చేస్తూ.. విద్వేషాన్ని సామరస్యం ఓడించాలన్నారు. దీనికి కేజ్రీవాల్‌ బదులిస్తూ.. ‘‘ఎన్నికలు భారత్‌ అంతర్గత వ్యవహారం. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారి జోక్యాన్ని సహించబోం’’ అన్నారు.

Updated Date - May 26 , 2024 | 07:07 AM