Share News

Pune car accident : ‘పుణే ప్రమాదం’ నిందితుడి తాతకూ కస్టడీ

ABN , Publish Date - May 26 , 2024 | 06:02 AM

మహారాష్ట్రలోని పుణే కారు ప్రమాద ఘటనలో నిందితుడైన బాలుడి తాతకు ఈనెల 28 వరకు పోలీసు కస్టడీని ప్రత్యేక కోర్టు విధించింది. రోడ్డు ప్రమాదం జరిగిన రోజున కారును నడిపానని ఒప్పుకోవాలంటూ ఫ్యామిలీ డ్రైవర్‌కు

Pune car accident : ‘పుణే ప్రమాదం’ నిందితుడి తాతకూ కస్టడీ

పుణే, మే 25: మహారాష్ట్రలోని పుణే కారు ప్రమాద ఘటనలో నిందితుడైన బాలుడి తాతకు ఈనెల 28 వరకు పోలీసు కస్టడీని ప్రత్యేక కోర్టు విధించింది. రోడ్డు ప్రమాదం జరిగిన రోజున కారును నడిపానని ఒప్పుకోవాలంటూ ఫ్యామిలీ డ్రైవర్‌కు కొన్ని డబ్బులిచ్చి నిర్బంధించి బెదిరించినందుకు బాలుడి తాతపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయన్ను విచారించేందుకు వారం రోజుల కస్టడీ కోరగా.. కోర్టు నాలుగు రోజులకు అనుమతించింది. ఇక ఇప్పటికే బాలుడిని అబ్జర్వేషన్‌ హోంకు తరలించగా.. బాలుడి తండ్రి జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

Updated Date - May 26 , 2024 | 07:28 AM