Share News

జ్ఞానవాపిలో పూజలు కొనసాగించుకోవచ్చు

ABN , Publish Date - Feb 27 , 2024 | 03:59 AM

ఉత్తరప్రదేశ్‌లోని వారాణసీలో ఉన్న జ్ఞానవాపి మసీదు దక్షిణ సెల్లార్‌లోని హిందూ దేవతా విగ్రహాలకు పూజలు కొనసాగించుకోవచ్చని అలహాబాద్‌ హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది.

జ్ఞానవాపిలో పూజలు కొనసాగించుకోవచ్చు

ప్రయాగ్‌రాజ్‌, ఫిబ్రవరి 26: ఉత్తరప్రదేశ్‌లోని వారాణసీలో ఉన్న జ్ఞానవాపి మసీదు దక్షిణ సెల్లార్‌లోని హిందూ దేవతా విగ్రహాలకు పూజలు కొనసాగించుకోవచ్చని అలహాబాద్‌ హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. జనవరి 31న వారాణసీ జిల్లా కోర్టు మేజిస్ట్రేట్‌ ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ జ్ఞానవాపి మసీదు నిర్వహణ కమిటీ దాఖలు చేసిన రెండు పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ రోహిత్‌ రంజన్‌ అగర్వాల్‌ తీర్పు వెలువరించారు. కాశీ విశ్వనాథుని ఆలయం పక్కనే ఉన్న మసీదులోని వ్యాస్‌ తెహ్ఖానాలో పూజలు కొనసాగించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామని అంజుమన్‌ ఇంతెజామియా మస్జిద్‌ జాయింట్‌ సెక్రటరీ మహమ్మద్‌ యాసిన్‌ తెలిపారు. అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై తమ న్యాయవాదులు అధ్యయనం చేసిన దరిమిలా పిటిషన్‌ వేయనున్నట్టు పేర్కొన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 03:59 AM