యూపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ప్రీతిసూదన్
ABN , Publish Date - Aug 01 , 2024 | 06:05 AM
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) చైర్‌పర్సన్‌గా ప్రీతిసూదన్ నియమితులయ్యారు. ప్రస్తుతం యూపీఎస్సీ సభ్యురాలిగా ఉన్న ఆమె ఆగస్టు 1న ఈ మేరకు బాధ్యతలు
న్యూఢిల్లీ, జూలై 31: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) చైర్‌పర్సన్‌గా ప్రీతిసూదన్ నియమితులయ్యారు. ప్రస్తుతం యూపీఎస్సీ సభ్యురాలిగా ఉన్న ఆమె ఆగస్టు 1న ఈ మేరకు బాధ్యతలు స్వీకరించనున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రీతి సుదన్ 1983 బ్యాచ్ ఏపీ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. 2020 జూలై వరకు మూడేళ్ల పాటు కేంద్ర ఆరోగ్య కార్యదర్శిగా ఆమె సేవలందించారు. కాగా, వ్యక్తిగత కారణాల వల్ల జూలై 4న యూపీఎస్సీ చైర్మన్ పదవికి మనోజ్ సోని రాజీనామా చేశారు.