Share News

Prajwal : రేపు సిట్‌ ముందుకు ప్రజ్వల్‌

ABN , Publish Date - May 30 , 2024 | 05:49 AM

రాసలీలల కేసులో చిక్కుకున్న హాసన్‌ జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ బెంగళూరు వచ్చేందుకు విమాన టికెట్‌ రిజర్వు చేసుకున్నారు. జర్మనీలోని మ్యూనిక్‌ ఎయిర్‌పోర్ట్‌

Prajwal  : రేపు సిట్‌ ముందుకు ప్రజ్వల్‌

బెంగళూరు, మే 29(ఆంధ్రజ్యోతి): రాసలీలల కేసులో చిక్కుకున్న హాసన్‌ జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ బెంగళూరు వచ్చేందుకు విమాన టికెట్‌ రిజర్వు చేసుకున్నారు. జర్మనీలోని మ్యూనిక్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బెంగళూరు కెంపేగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రజ్వల్‌ పేరిట టికెట్‌ రిజర్వు అయినట్టు సమాచారం. ప్రజ్వల్‌ శుక్రవారం బెంగళూరుకు చేరుకోనున్నారు. అదేరోజు ఆయన సిట్‌ ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది.

Updated Date - May 30 , 2024 | 05:49 AM