Share News

యడియూరప్పపై పోక్సో కేసు

ABN , Publish Date - Mar 16 , 2024 | 04:47 AM

కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై బెంగళూరు నగరం సదాశివనగర్‌ పోలీసుస్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. మైనర్‌ అయిన తన కూతురుపై ఫిబ్రవరి 2న యడియూరప్ప

యడియూరప్పపై పోక్సో కేసు

బెంగళూరు, మార్చి 15(ఆంధ్రజ్యోతి): కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై బెంగళూరు నగరం సదాశివనగర్‌ పోలీసుస్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. మైనర్‌ అయిన తన కూతురుపై ఫిబ్రవరి 2న యడియూరప్ప లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారని బాలిక తల్లి గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయం కోసం కూతురుతో కలిసి వెళ్లానని, యడియూరప్ప తమతో 9 నిమిషాలపాటు మాట్లాడారని, ఆ తర్వాత బాలికను గదిలోకి తీసుకెళ్లి లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. గది నుంచి బయటకు వచ్చిన యడియూరప్ప క్షమాపణలు చెప్పారని, ఎవరికీ చెప్పవద్దని భయపెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు పోక్సో చట్టం 8, ఐపీసీ సెక్షన్‌ 354(ఎ) కింద కేసు నమోదు చేశారు. ఈ విషయమై యడియూరప్ప శుక్రవారం బెంగళూరులో స్పందించారు. తమకు అన్యాయం జరిగిందని తల్లీకూతుళ్లు నెలన్నర కిందట తన ఇంటికి వచ్చి కన్నీరు పెట్టుకున్నారని, కొంత ఆర్థిక సాయం చేసి, నగర పోలీసు కమిషనర్‌కు ఫోన్‌ చేసి వారికి న్యాయం చేయాలని సూచించానని అన్నారు. ఈ కేసును చట్టపరంగా ఎదుర్కొంటానని, అంతకు మించి మాట్లాడేది ఏమీ లేదని అన్నారు. కాగా ఈ కేసు విచారణను సీఐడీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు డీజీపీ అలోక్‌మోహన్‌ తెలిపారు.

Updated Date - Mar 16 , 2024 | 04:47 AM