Share News

BJP Manifesto 2024 Live Updates: వికసిత భారత్ పేరుతో బీజేపీ మేనిఫెస్టో విడుదల.. కీలక అంశాలివే..

ABN , First Publish Date - Apr 14 , 2024 | 08:26 AM

BJP Manifesto Sankalp Patra 2024 Live Updates: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ(BJP) అధినాయకత్వం ఇవాళ తమ పార్టీ మేనిఫెస్టోను(BJP Manifesto) విడుదల చేసింది. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా, అధునాతన దేశంగా భారత్‌ అవతరించేందుకు మోదీ(PM Modi) సారథ్యంలో భారతీయ జనతా పార్టీ అనుసరించబోయే విధానాలను వివరిస్తూ ఆ పార్టీ తన ఎన్నికల మ్యానిస్టోను విడుదల చేసింది.

BJP Manifesto 2024 Live Updates: వికసిత భారత్ పేరుతో బీజేపీ మేనిఫెస్టో విడుదల.. కీలక అంశాలివే..
BJP Manifesto 2024

Live News & Update

  • Apr 14, 2024 11:04 IST

    బీజేపీ మేనిఫెస్టో‌లో పాయింట్స్ ఇవే..

    • మత్స్య ఉత్పత్తి, ప్రాసెసింగ్‌ కోసం ప్రత్యేక క్లస్టర్లు

    • ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం

    • సముద్ర నాచు, ముత్యాల సాగు దిశగా మత్స్యకారులను ప్రోత్సహించడం

    • నానో యూరియా వినియోగం మరింత పెంచడం

    • మేనిఫెస్టోలోని కీలక అంశాలు

    • 70 ఏళ్లు పైబడిన వృద్ధిలకు ఆయుష్మాన్‌ భారత్‌లో భాగంగా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం

    • పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు కట్టించడం

    • పైపు ద్వారా ఇంటింటికీ గ్యాస్‌ అందజేత

  • Apr 14, 2024 11:02 IST

    బీజేపీ మేనిఫెస్టో‌లో పాయింట్స్ ఇవే..

    • వచ్చే ఐదేళ్లలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులు చేసే దిశగా కృషి

    • దివ్యాంగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం

    • ట్రాన్స్‌జెండర్లకు సైతం ఆయుష్మాన్‌ భారత్‌

    • మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులకు మార్చే ప్రణాళిక

    • ముద్ర రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపు

    • డెయిరీ సహకార సంఘాల సంఖ్య పెద్ద సంఖ్యలో పెంపు

    • కూరగాయల సాగు, వాటి నిల్వ కోసం కొత్త క్లస్టర్లు

    • మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం

  • Apr 14, 2024 11:02 IST

    బీజేపీ మేనిఫెస్టో‌లో పాయింట్స్ ఇవే..

    • టూరిజం అభివృద్ధి

    • 6జి టెక్నాలజి దేశంలో అమలుకు సిద్ధంగా ఉన్నాం

    • పెట్రోల్ ధరలు తగ్గిస్తాం. పెట్రోలు వినియోగాన్ని అవకాశం ఉన్నంత మేరకు తగ్గిస్తాం

    • 2036లో ఒలింపిక్స్ దేశంలో నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తాం

    • మేనిఫెస్టోలోని కీలక అంశాలు

    • 70 ఏళ్లు పైబడిన వృద్ధిలకు ఆయుష్మాన్‌ భారత్‌లో భాగంగా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం

    • పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు కట్టించడం

    • పైపు ద్వారా ఇంటింటికీ గ్యాస్‌ అందజేత

  • Apr 14, 2024 11:00 IST

    బీజేపీ మేనిఫెస్టో‌లో పాయింట్స్ ఇవే..

    • భారత సంస్కృతి ని విశ్వ వ్యాప్తం చేస్తాం.

    • యోగా సర్టిఫికేషన్ భారత్ ఇస్తుంది.

    • ఎస్సి, ఎస్టీ వెనుకబడిన వర్గాల వారికి ప్రాధాన్యత

    • శ్రామికులకు ఈ శ్రామిక్ పోర్టల్ ద్వారా సంక్షేమ ఫలాలు.

    • ట్రక్ డ్రైవర్ల కోసం హైవేల వెంట సదుపాయాలు

    • వన్ నేషన్ వన్ ఎలక్షన్, మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేస్తాం

    • నూతన రైళ్లు, హైవేలు, విమానాశ్రయలు, మౌళిక సదుపాయాల కల్పన

    • బులెట్ ట్రెయిన్ ఫిజబులిటి పై అధ్యయనం మొదలైంది

  • Apr 14, 2024 11:00 IST

    బీజేపీ మేనిఫెస్టో‌లో పాయింట్స్ ఇవే..

    • వచ్చే ఐదేళ్లలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులు చేసే దిశగా కృషి

    • దివ్యాంగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం

    • ట్రాన్స్‌జెండర్లకు సైతం ఆయుష్మాన్‌ భారత్‌

    • మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులకు మార్చే ప్రణాళిక

    • ముద్ర రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపు

    • డెయిరీ సహకార సంఘాల సంఖ్య పెద్ద సంఖ్యలో పెంపు

  • Apr 14, 2024 10:45 IST

    బీజేపీ మేనిఫెస్టో‌లో పాయింట్స్ ఇవే..

    • కూరగాయల సాగు, వాటి నిల్వ కోసం కొత్త క్లస్టర్లు

    • మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం

    • మత్స్య ఉత్పత్తి, ప్రాసెసింగ్‌ కోసం ప్రత్యేక క్లస్టర్లు

    • ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం

    • సముద్ర నాచు, ముత్యాల సాగు దిశగా మత్స్యకారులను ప్రోత్సహించడం

    • నానో యూరియా వినియోగం మరింత పెంచడం

  • Apr 14, 2024 10:40 IST

    బీజేపీ మేనిఫెస్టో లైవ్ వీడియో ఇక్కడ చూడండి..

  • Apr 14, 2024 10:30 IST

    • వ్యవసాయంలో సాంకేతికతను ప్రోత్సహిస్తున్నాం

    • మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారేందుకు ప్రోత్సహిస్తున్నాం

    • ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు గ్రామీణాభివృద్ధికి గ్రోత్ ఇంజిన్ లాంటివి

    • బీజేపీ సంకల్ప పత్రం యువత ఆకాంక్షలను ప్రతిబింబిస్తోంది.

  • Apr 14, 2024 10:15 IST

    వారికీ ఆయుష్మాన్..

    • 70 ఏళ్లు పై బడిన వారికి ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపు

    • మహిళలను లక్షాధికారులను చేయడమే మా లక్ష్యం

    • ముద్ర రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపు

    • ముద్ర పథకం ద్వారా కోట్ల మందికి ఉపాధి లభించింది

    • మరో ఐదేళ్లు ఉచిత రేషన్ అందిస్తాం

    • పేదల జీవితాలు మార్చడమే మోడీ ఇస్తున్న గ్యారెంటీ

  • Apr 14, 2024 10:00 IST

    • పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ సబ్సిడీ గ్యాస్ అందిస్తాం

    • సూర్యఘర్ పథకం ద్వారా పేదలకు ఉచిత విద్యుత్

    • పేదల కోసం మరో 3 కోట్ల పక్కా ఇళ్లు నిర్మిస్తాం

    • ఈ పదేళ్లలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేపట్టాం

    • యువత, మహిళ, పేద వర్గాలపై అధిక దృష్టి సారించాం

    • ఇచ్చిన ప్రతి హామీని బీజేపీ నెరవేరుస్తుంది

  • Apr 14, 2024 09:52 IST

    గత పది ఏళ్లలో బీజేపీ సాధించిన విజయాలపై కరపత్రం..

    • జీ -20 సమర్థవంతంగా నిర్వహించాం

    • కాశీ విశ్వనాథ్ కారిడార్, మహాకాళ్ కారిడార్ నిర్మాణం జరిపాం

    • నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చాం

    • ప్రపంచంలో అతి పెద్ద పన్ను సంస్కరణ తీసుకొచ్చి జీఎస్టీ అమలు చేస్తున్నాం

    • మహిళలకు చట్ట సభల్లో 33% రిజర్వేషన్ల కోసం చట్టం చేశాం

    • డిజిటల్ లావాదేవీల్లో భారత్ నంబర్ 1 గా నిలిచేలా చేశాం

  • Apr 14, 2024 09:50 IST

    గత పది ఏళ్లలో బీజేపీ సాధించిన విజయాలపై కరపత్రం..

    • 7 ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఎయిమ్స్, 390 యూనివర్సిటీలు ఏర్పాటు చేశాం

    • రోజుకు 37 కి.మీ వేగంతో హైవేల నిర్మాణం. 2014 నాటికి ఇది కేవలం రోజుకు 12 కి.మీ మాత్రమే ఉండేది

    • ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని 75% మేర ఉపసంహరించాము

    • కోవిడ్-19 సమయంలో 2.97కోట్ల మందిని సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చాం

    • యుద్ధం, సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకున్న 30,000 కి పైగా భారతీయులను సూడాన్, ఉక్రెయిన్, లిబియా, యెమెన్ దేశాల నుంచి భారత్ కు తిరిగి తీసుకొచ్చాం

  • Apr 14, 2024 09:49 IST

    గత పది ఏళ్లలో బీజేపీ సాధించిన విజయాలపై కరపత్రం..

    • దేశవ్యాప్తంగా 20 నగరాల్లో మెట్రో సేవల విస్తరణ

    • 2014 లో 74 విమానాశ్రయాల సంఖ్య నేడు 149కి చేరింది

    • 100 పైగా స్మార్ట్ సిటీస్ లో 7,800 ప్రాజెక్టులు

    • 80 వందే భారత్ రైళ్లు అందుబాటులోకి తెచ్చాం. 2047 నాటికి 4,500 అందుబాటులోకి తేవాలని లక్ష్యం

    • 40,000 సాధారణ రైల్ కొచ్ లను వందే భారత్ స్థాయికి అప్‌గ్రేడ్ చేశాం

  • Apr 14, 2024 09:45 IST

    గత పది ఏళ్లలో బీజేపీ సాధించిన విజయాలపై కరపత్రం..

    • పీఎం ఉజ్వల యోజన ద్వారా 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లు

    • ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 37 కోట్ల లబ్ధిదారులకు ఆరోగ్య బీమా

    • పీఎం స్వనిధి ద్వారా 78 లక్షల వీధి వ్యాపారులకు చేయూత

    • జన్ దన్ ఖాతాల ద్వారా 51 కోట్ల మందికి బ్యాంకింగ్ సేవలు

  • Apr 14, 2024 09:44 IST

    గత పది ఏళ్లలో బీజేపీ సాధించిన విజయాలపై కరపత్రం..

    • ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా 80 కోట్ల మందికి ఆహార భద్రత

    • 4 కోట్ల మందికి పైగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా గృహాలు

    • 11.8 కోట్ల గృహాలకు జల్ జీవన్ మిషన్ ద్వారా సురక్షిత తాగు నీటి నల్లా కనెక్షన్లు

    • స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మాణం

    • పిఎం కిసాన్ సమృద్ధి యోజన ద్వారా 11 కోట్ల పైగా రైతులకు ఏడాదికి రూ. 6 వేలు ఆర్థిక సహాయం

  • Apr 14, 2024 09:43 IST

    గత పది ఏళ్లలో బీజేపీ సాధించిన విజయాలపై కరపత్రం..

    • 25 కోట్ల భారతీయులను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం

    • భారతదేశాన్ని ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాము

    • ఆర్టికల్ 370 రద్దుచేసి జమ్మూ కాశ్మీర్లో శాంతిని నెలకొల్పాం

    • అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ట చేశాం

    • చంద్రుడి దక్షిణ ధృవంపై కాలుమోపిన మొట్టమొదటి దేశంగా భారత్

    • సౌభాగ్య యోజన కింద 100% ఇళ్లకు విద్యుత్ కనెక్షన్

  • Apr 14, 2024 09:41 IST

    లబ్ధిదారులకే మేనిఫెస్టో..

    కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థికంగా వృద్ధి చెందిన పలువురికి మ్యానిఫెస్టో కాపీని ప్రధాని మోదీ అందించారు.

  • Apr 14, 2024 09:38 IST

    వికసిత భారత్ పేరుతో బీజేపీ మేనిఫెస్టో విడుదల..

    వికసిత భారత్ పేరుతో బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు.

  • Apr 14, 2024 09:25 IST

    ఏం చెప్పామో అది చేశాం: జేపీ నడ్డా

    మేం ఏం చెప్పామో అది చేసి చూపించాం. ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అందించాం. ఆర్టికల్ 370ని రద్దు చేస్తామన్నాం చేశాం. ట్రిపుల్ తలాక్ తొలగించాం. 4 కోట్ల పక్కా గృహాలు నిర్మించాం.

  • Apr 14, 2024 09:15 IST

    బీజేపీ ప్రధాన కార్యాలయానికి ముఖ్య నేతలు..

    బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటున్న పార్టీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు చేరుకున్నవారిలో మోదీ , అమిత్ షా , నడ్డా ,బీఎల్ సంతోష్, అశ్విని వైష్ణవ్, జై శంకర్, తరుణ్ చుగ్, షానవాజ్ హుస్సేన్, అరుణ్ సింగ్ తదితరులు

  • Apr 14, 2024 09:14 IST

    మా పనితీరును మేనిఫెస్టో ఆవిష్కరిస్తుంది: జేపీ నడ్డా

    దేశాభివృద్దే లక్ష్యంగా బీజేపీ పని చేస్తుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం పురోగమిస్తోంది. సామాజిక న్యాయం కోసం బీజేపీ కృషి చేస్తోంది. వచ్చే ఐదేళ్లే దేశానికి ఎలా సేవ చేస్తామో.. మా మేనిఫెస్టో ఆవిష్కరిస్తుంది.

  • Apr 14, 2024 09:09 IST

    మేనిఫెస్టోను రూపొందించింది వీరే..

    మేనిఫెస్టో కోసం రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన 27 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వివిధ రంగాల నిపుణులతో సమావేశాలు జరిపింది. అలాగే నమో యాప్ సహా వివిధ రూపాల్లో ప్రజల నుంచి సూచనలు తీసుకుంది. మొత్తం 15 లక్షల మంది నుంచి వచ్చిన సూచనలతో మేనిఫెస్టో రూపకల్పన చేశారు. "పాంచ్ న్యాయ్ - పచ్చీస్ గ్యారంటీ" పేరుతో మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. దీంతో బీజేపీ మేనిఫెస్టోపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

  • Apr 14, 2024 09:00 IST

    ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ ముఖ్య నేతలు బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు.

  • Apr 14, 2024 08:15 IST

    BJP Manifesto Sankalp Patra 2024 Live Updates: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ(BJP) అధినాయకత్వం ఇవాళ తమ పార్టీ మేనిఫెస్టోను(BJP Manifesto) విడుదల చేయనుంది. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా, అధునాతన దేశంగా భారత్‌ అవతరించేందుకు మోదీ(PM Modi) సారథ్యంలో భారతీయ జనతా పార్టీ అనుసరించబోయే విధానాలను వివరిస్తూ ఆ పార్టీ తన ఎన్నికల మ్యానిస్టోను విడుదల చేయబోతుంది. ‘మోదీ గ్యారెంటీ-2047 కల్లా వికసిత భారత్‌’ పేరుతో.. బీజేపీ(BJP) కేంద్ర కార్యాలయంలో ఉదయం 8:30కి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అగ్రనేతలు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌తో కలిసి ప్రధాని మోదీ ఈ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు. అవినీతిపై మోదీ ప్రారంభించిన పోరాటం ఆగదని.. ప్రతిపక్షాలు ఎంత దుష్ప్రచారం చేసినా అవినీతిని నిర్మూలించేందుకు బీజేపీ కట్టుబడి ఉందని, మరిన్ని చట్టాలు చేస్తుందని ఈ మేనిఫెస్టోలో ప్రకటించబోతున్నారు.