Share News

PM Modi: ఆడపిల్లల అభ్యున్నతికి తోడ్పడేలా నిర్ణయాలు

ABN , Publish Date - Jan 24 , 2024 | 11:56 AM

కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల అభ్యున్నతికి తోడ్పడేలా విధానపర నిర్ణయాలు తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. బుధవారం జాతీయ బాలికల దినోత్సవం(National Girl Child Day) సందర్భంగా ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

PM Modi: ఆడపిల్లల అభ్యున్నతికి తోడ్పడేలా  నిర్ణయాలు

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల అభ్యున్నతికి తోడ్పడేలా విధానపర నిర్ణయాలు తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. బుధవారం జాతీయ బాలికల దినోత్సవం(National Girl Child Day) సందర్భంగా ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

"సమాజాన్ని మార్చే శక్తి ఆడపిల్లలకు ఉంది. వారు నేర్చుకోవడానికి, ఎదగడానికి, తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేయడానికి బీజేపీ అహర్నిషలు కృషి చేస్తోంది. ఆడపిల్లల తిరుగులేని స్ఫూర్తిదాయక విజయాలు చరిత్రలో నిలిచిపోతున్నాయి. అన్ని రంగాల్లో ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న వారి గమనం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆడపిల్లలు దేశాన్ని, సమాజాన్ని మెరుగుపరిచే పౌరులు. వారిని రక్షించేందుకు 2015 నుంచి బేటీ బచావో - బేటీ పడావో అంటూ ఎన్నో వినూత్న పథకాలను తీసుకొచ్చాం" అని ప్రధాని ఎక్స్‌లో రాసుకొచ్చారు.

"మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

Updated Date - Jan 24 , 2024 | 11:56 AM