Share News

Kolkata: సంపద పంపిణీ అగ్గికి పిట్రోడా ఆజ్యం

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:30 AM

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను పంపిణీ చేసేస్తుందంటూ బీజేపీ పెద్దఎత్తున విరుచుకుపడుతున్న సమయంలో.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శామ్‌పిట్రోడా వారసత్వ పన్ను ప్రస్తావనతో ఆ అగ్నికి ఆజ్యం పోశారు. ‘‘అమెరికాలో 10 కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి చనిపోతే.. అతని వారసులకు 45ుమాత్రమే వారసత్వంగా వస్తుంది. మిగతా 55ు ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది.

Kolkata: సంపద పంపిణీ అగ్గికి పిట్రోడా ఆజ్యం

అమెరికాలో సంపన్నులు చనిపోతే వారి ఆస్తిలో 55ు ప్రభుత్వానికి వెళ్తుందన్న కాంగ్రెస్‌ నేత.. మండిపడ్డ ప్రధాని

న్యూఢిల్లీ, ఏప్రిల్‌24: కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను పంపిణీ చేసేస్తుందంటూ బీజేపీ పెద్దఎత్తున విరుచుకుపడుతున్న సమయంలో.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శామ్‌పిట్రోడా వారసత్వ పన్ను ప్రస్తావనతో ఆ అగ్నికి ఆజ్యం పోశారు. ‘‘అమెరికాలో 10 కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి చనిపోతే.. అతని వారసులకు 45ుమాత్రమే వారసత్వంగా వస్తుంది. మిగతా 55ు ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది.

అది చాలా ఆసక్తికరమైన చట్టం’’.. అంటూ ఏఎన్‌ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు బీజేపీకి అందివచ్చిన ఆయుధంలా మారాయి! సంపదను సృష్టించినవారు అందులో సగం ప్రజలకు వదిలి వెళ్లిపోవడం తనకు న్యాయమేననిపిస్తోందని.. భారత్‌లో అలాంటిదిలేదని, సంపన్నుల ఆస్తి మొత్తం పిల్లలకే వెళ్తుందని పిట్రోడా ఆ ఇంటర్వ్యూలో అన్నారు.


ప్రచారంలో కాంగ్రె్‌సపై దూకుడుగా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ.. పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పలువురు బీజేపీ నేతలూ పిట్రోడా వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ ఆత్మరక్షణలో పడింది. పిట్రోడా వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని.. పార్టీకి వాటితో సంబంధంలేదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జైరామ్‌ రమేశ్‌ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని.. ఆ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ పార్టీకిగానీ, పార్టీ మేనిఫెస్టోకిగానీ ఎలాంటి సంబంధం లేదని పిట్రోడా అన్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై ప్రధాని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

అమెరికాలో అలాంటి చట్టం ఉందా?

శామ్‌పిట్రోడా పేర్కొన్నట్టుగా సంపన్నులు చనిపోతే వారి ఆస్తిలో 55ు ప్రభుత్వ ఖజానాకు చెందేలా ఫెడరల్‌ చట్టమేదీ లేదు. ఆ దేశంలో 50 రాష్ట్రాలుండగా 6 రాష్ట్రాల్లో మాత్రమే (అయోవా, కెంటకీ, మేరీలాండ్‌, నెబ్రాస్కా, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా) వారసత్వ పన్ను ఉంది. ఆ ఆస్తి విలువను బట్టి ఒక శాతంకన్నా తక్కువ నుంచి గరిష్ఠంగా 18ుదాకా మాత్రమే ఉంది. ఆ పన్ను కూడా అందరికీ వర్తించదు. ఉదాహరణకు.. చనిపోయిన వ్యక్తి భార్యకే ఆస్తి మొత్తం వెళ్తే ఈ పన్ను వర్తించదు. ఇలా బోలెడన్ని షరతులు.. మినహాయింపులు ఉంటాయి. పిట్రోడా ఇవేవీ పట్టించుకోకుండా యథాలాపంగా 55ుఅంటూ వ్యాఖ్యలు చేయడం కాంగ్రె్‌సను ఇబ్బంది పెడుతోంది.


రూ. 25 వేల కోట్ల స్కాంలో సునేత్రకు క్లీన్‌చిట్‌

ముంబై, ఏప్రిల్‌ 24: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ సతీమణి, బారామతి లోక్‌సభ స్థానం ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్‌కు రూ.25వేల కోట్ల కుంభకోణంలో ముంబై పోలీసులు క్లీన్‌చిట్‌ ఇచ్చారు. మహారాష్ట్ర స్టేట్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకు (ఎంఎ్‌ససీబీ)లో చోటుచేసుకున్న స్కాంకు సంబంధించిన కేసులో దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) ఈ ఏడాది జనవరిలోనే తుది నివేదికను సమర్పించింది.

అందులోని వివరాలు తాజాగా బయటికొచ్చాయి. ఇందులో సునేత్ర పవార్‌, ఆమె భర్త అజిత్‌కు సంబంధించిన లావాదేవీల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎలాంటి క్రిమినల్‌ నేరం జరగలేదని.. అజిత్‌కు చెందిన జరందేశ్వర్‌ షుగర్‌ మిల్లుకు జారీ చేసిన రుణాల విషయంలో బ్యాంకుకు ఎలాంటి నష్టం జరగలేదని నివేదికలో తెలిపారు.


ప్రస్తుతం ఎన్‌సీపీ చీఫ్‌గా ఉన్న అజిత్‌ పవార్‌.. గతేడాది తన వర్గంతో బీజేపీ, శివసేన (ఏక్‌నాథ్‌ షిండే వర్గం) అధికార కూటమిలో చేరి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కాగా సార్వత్రిక ఎన్నికల వేళ సునేత్రకు క్లీన్‌చిట్‌ ఇస్తూ నివేదిక బయటికిరావడంతో మహారాష్ట్ర సర్కారు, బీజేపీపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ‘బీజేపీ వాషింగ్‌మెషీన్‌’ అంటూ విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు సమంజసమేనని.. పోలీసుల చర్యే ఇందుకు నిదర్శమని శివసేన (యూబీటీ) నేత ఆనంద్‌ దూబే అన్నారు. ‘రూ.25 వేల కోట్ల కుంభకోణం గురించి గతంలో ప్రధాని మాట్లాడుతూ పవార్‌ కుటుంబీకులందరూ అవినీతిపరులేనని ఊగిపోయారు. ఇప్పుడు వారు బీజేపీతో కలిసిపోగానే సునేత్రకు క్లీన్‌చిట్‌ ఇచ్చారు. ప్రతిపక్షాలు అంటున్నట్లు ‘బీజేపీ వాషింగ్‌ పౌడర్‌’ వ్యాఖ్యలు నిజమేనని రుజువైంది’ అన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 07:15 AM