Share News

కరోల్‌కు 8.33 కోట్ల డాలర్లు చెల్లించండి

ABN , Publish Date - Jan 28 , 2024 | 01:28 AM

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. లైంగిక వేధింపుల కేసులో రచయిత్రి ఇ.జీన్‌ కరోల్‌కు ఆయన 8.33 కోట్ల డాలర్లు (దాదాపు రూ.690 కోట్లు) నష్టపరిహారం

కరోల్‌కు 8.33 కోట్ల డాలర్లు చెల్లించండి

  • డొనాల్డ్‌ ట్రంప్‌ను ఆదేశించిన అమెరికా కోర్టు

న్యూయార్క్‌, జనవరి 27: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. లైంగిక వేధింపుల కేసులో రచయిత్రి ఇ.జీన్‌ కరోల్‌కు ఆయన 8.33 కోట్ల డాలర్లు (దాదాపు రూ.690 కోట్లు) నష్టపరిహారం కింద చెల్లించాలని మాన్‌హట్టన్‌ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కొన్నేళ్ల క్రితం తనపై అత్యాచారం చేసిన ట్రంప్‌... ఇప్పుడు ఒక జర్నలిస్టుగా తన విశ్వసనీయతను దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కరోల్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఐదు రోజుల విచారణ అనంతరం మాన్‌హట్టన్‌ ఫెడరల్‌ కోర్టు న్యాయమూర్తులు శుక్రవారం మూడు గంటల్లోనే తీర్పును వెలువరించారు. కరోల్‌కు నష్టపరిహారం కింద 1.83 కోట్ల డాలర్లు చెల్లించాలని, అలాగే భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలతో ఆమెను కించపరచకుండా ఉండేందుకు మరో 6.5 కోట్ల డాలర్లు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అయితే ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ట్రంప్‌ ప్రకటించారు.

Updated Date - Jan 28 , 2024 | 07:58 AM