Share News

Parliament : 24 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు?

ABN , Publish Date - Jun 12 , 2024 | 04:07 AM

ఈ నెల 24 నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ నెల 24 నుంచి జూలై

Parliament : 24 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు?

న్యూఢిల్లీ, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 24 నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ నెల 24 నుంచి జూలై 3వ తేదీ వరకు ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని తెలిసింది. ఈ నెల 24, 25 తేదీల్లో ఎంపీల ప్రమాణస్వీకారం, 26న స్పీకర్‌ ఎన్నిక కార్యక్రమం ఉండే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం. అయితే ఈసారి స్పీకర్‌ పదవి ఎవరికి దక్కొచ్చనే చర్చ జోరుగా సాగుతోంది. బీజేపీకి చెందిన వారికే ఆ పదవి ఇస్తారా? లేక ఎన్డీయేలోని మరెవరికైనా అవకాశం కల్పిస్తారా? అనే చర్చ జరుగుతోంది.

Updated Date - Jun 12 , 2024 | 04:07 AM