Share News

Naveen Patnaik resigns : ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ రాజీనామా

ABN , Publish Date - Jun 06 , 2024 | 05:28 AM

ఒడిసా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బిజూ జనతాదళ్‌ (బీజేడీ) ఓడిపోవడంతో ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం నవీన్‌ పట్నాయక్‌ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని బుధవారమిక్కడి రాజ్‌భవన్‌లో

Naveen Patnaik resigns : ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ రాజీనామా

24 ఏళ్లు పదవిలో కొనసాగిన బీజేడీ అధినేత

భువనేశ్వర్‌, జూన్‌ 5: ఒడిసా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బిజూ జనతాదళ్‌ (బీజేడీ) ఓడిపోవడంతో ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం నవీన్‌ పట్నాయక్‌ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని బుధవారమిక్కడి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ రఘుబర్‌ దాస్‌కు అందజేశారు. 2000వ సంవత్సరం మార్చి 5న తొలిసారి సీఎంగా ప్రమాణం చేసిన ఆయన.. 24 ఏళ్లు అప్రతిహతంగా ఆ పదవిలో కొనసాగారు. తాజా ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా విజయం సాధించింది. 147 స్థానాల అసెంబ్లీలో 78 సీట్లు గెలుచుకుంది. బీజేడీ 51 స్థానాల్లో విజయం సాఽధించింది. ఇక రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీచేసిన నవీన్‌.. గంజాం జిల్లాలో సొంత నియోజకవర్గం హింజిలిలో 4,636 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలిచారు. బోలంగీర్‌ జిల్లా కాంటాబాంజీలో కొత్త అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 26 ఏళ్ల రాజకీయ జీవితంలో నవీన్‌ ఓడిపోవడం ఇదే తొలిసారి.

Updated Date - Jun 06 , 2024 | 05:28 AM