Share News

పీవోకేలో ఆగని హింస.. కాల్పుల్లో ముగ్గురి మృతి

ABN , Publish Date - May 15 , 2024 | 03:21 AM

క్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే) హింసతో అట్టుడుకిపోతోంది. భారీగా పెరిగిన ఆహార, విద్యుత్‌, నిత్యావసరాల ధరలను తగ్గించాలంటూ అవామీ యాక్షన్‌ కమిటీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.

పీవోకేలో ఆగని హింస.. కాల్పుల్లో ముగ్గురి మృతి

ఇస్లామాబాద్‌, మే 14: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే) హింసతో అట్టుడుకిపోతోంది. భారీగా పెరిగిన ఆహార, విద్యుత్‌, నిత్యావసరాల ధరలను తగ్గించాలంటూ అవామీ యాక్షన్‌ కమిటీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. మంగళవారం భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు.

ముజాఫరాబాద్‌లో జరుగుతున్న అల్లర్లను కట్టడి చేసేందుకు ప్రభుత్వం మిలటరీ దళాలను భారీగా మోహరించింది. మంగళవారం భద్రతా దళాల కాన్వాయ్‌ షోరన్‌దా నక్కా గ్రామాన్ని చేరుకోగానే ఆందోళనకారులు దానిపై రాళ్ల దాడి చేశారు.

దాడిని నిరోధించేందుకు భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఇదిలా ఉండగా, పీవోకేలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పాకిస్థాన్‌ ప్రభుత్వం 2300 కోట్ల పాకిస్థానీ రూపాయలను విడుదల చేసింది.

Updated Date - May 15 , 2024 | 06:47 AM