Share News

తీర్పుల్లో వ్యక్తిగత అభిప్రాయాలు వద్దు: సుప్రీం

ABN , Publish Date - Aug 21 , 2024 | 05:22 AM

యవ్వనంలోని బాలికలకు కలకత్తా హైకోర్టు ఇచ్చిన ‘అభ్యంతరకర సలహాల’ను మంగళవారం సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. తీర్పులో వ్యక్తిగత అభిప్రాయాలు ఉండకూడదని తెలిపింది. ఇటీవల లైంగిక దాడి కేసులో 20 ఏళ్ల శిక్ష పడ్డ నిందితుడ్ని నిర్దోషిగా విడుదల చేసిన కలకత్తా

తీర్పుల్లో వ్యక్తిగత అభిప్రాయాలు వద్దు: సుప్రీం

న్యూఢిల్లీ, ఆగస్టు 20: యవ్వనంలోని బాలికలకు కలకత్తా హైకోర్టు ఇచ్చిన ‘అభ్యంతరకర సలహాల’ను మంగళవారం సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. తీర్పులో వ్యక్తిగత అభిప్రాయాలు ఉండకూడదని తెలిపింది. ఇటీవల లైంగిక దాడి కేసులో 20 ఏళ్ల శిక్ష పడ్డ నిందితుడ్ని నిర్దోషిగా విడుదల చేసిన కలకత్తా హైకోర్టు.. ‘లైంగిక వాంఛనలను అదుపులో ఉంచుకోవాల’ంటూ తీర్పులో బాలికలకు పలు సూచనలు చేసింది. ‘రెండు నిమిషాల లైంగిక సుఖం కోసం చూసుకుంటే సమాజం దృష్టిలో ఆమె నష్టపోతుంది’ అని వ్యాఖ్యానించింది. అయితే ఈ సలహా అభ్యంతరకరమైనదంటూ గత ఏడాది డిసెంబరు 8న హైకోర్టు సుమోటోగా విచారణ ప్రారంభించింది. తీర్పుల్లో ప్రవచనాలు చెప్పడం జడ్జీల పనికాదని తెలిపింది. కేవలం విషయం ఆధారంగా తీర్పు చెప్పాలే తప్ప, వ్యక్తిగత అభిప్రాయాలుగానీ, ప్రవచనాలుగానీ ఉండకూదని ధర్మాసనం తెలిపింది.

Updated Date - Aug 21 , 2024 | 05:22 AM